Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

13-Sep-2016 12:20:16
facebook Twitter Googleplus
Photo

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎంత సంతోషంగా ఉన్నాడనే సంగతి మాటల్లో చెప్పడం చాలా కష్టం. టెంపర్ దగ్గర నుంచి జూనియర్ వరుస హిట్స్ కొడుతున్నా.. కమర్షియల్ హిట్ అనిపించుకోవడంలోను.. బ్లాక్ బస్టర్ స్థాయికి చేర్చడంలోనూ లోటు ఉండిపోయింది. నాన్నకు ప్రేమతో చిత్రం 50 కోట్లకు మించి వసూళ్లు రాబట్టినా.. కొన్ని ఏరియాల్లో డిస్ట్రిబ్యూటర్లు నష్టపోయారు. కానీ జనతా గ్యారేజ్ విషయంలో అలాంటివేమీ లేకుండా.. యూనానిమస్ హిట్ గా నిలిచింది.

అందుకే తన సంతోషాన్ని పంచుకునేందుకు ఇప్పటికే ఓసారి థ్యాంక్యూ మీట్ ఏర్పాటు చేసి డిస్ట్రిబ్యూటర్లు-మీడియా-సన్నిహితులకు పార్టీ ఇచ్చాడు ఎన్టీఆర్. తన అభిమానుల కోసం కూడా ఓ ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేస్తానని ముందే చెప్పగా.. ఆ రోజు ఇవాళే కావడం గమనించాలి. హైద్రాబాద్ లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో.. ఇవాళ సాయంత్రం 6 గంటలకు ఈ ఈవెంట్ జరగనుండగా.. అన్ని ఏరియాల నుంచి అభిమానులు ఈ కార్యక్రమానికి హాజరు అవుతున్నారు.

11 రోజుల్లోనే దాదాపు 70 కోట్ల షేర్ వసూళ్లను సాధించిన జనతా గ్యారేజ్.. ఇండస్ట్రీ టాప్ 5 లిస్ట్ లోకి చేరేందుకు అన్ని అవకాశాలు ఉన్నాయని.. ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అంతటి హిట్ కొట్టినపుడు.. ఎన్టీఆర్ తన ఆనందాన్ని ఈ రేంజ్ లో సెలబ్రేట్ చేసుకోవడం సహజమే కదా!

,  ,  ,  ,  ,