Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

28-Apr-2017 13:32:30
facebook Twitter Googleplus
Photo

బాహుబలి2 మూవీ మేనియా దేశమంతా బాగానే స్ప్రెడ్ అయింది. ఇప్పటికే నాలుగైదు రోజుల టికెట్స్ అమ్మేసినట్లుగా థియేటర్ వర్గాలు చెబుతున్నాయి. వీటిలో అనేక కార్పొరేట్ బుకింగ్స్.. బల్క్ బుకింగ్స్ కూడా ఉండడం విశేషం. మరోవైపు బాహుబలి2 మూవీ చూసేందుకు చాలా కంపెనీలు సెలవు కూడా ప్రకటించారనే టాక్ ఉంది.

ఇప్పుడు బాహుబలి కోసం ఇండస్ట్రీ జనాలు కూడా ఇదే స్థాయిలో సెలవలు ఇస్తున్నారు. రాజమౌళి- జూనియర్ ఎన్టీఆర్ ల అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందుకే ఎన్టీఆర్ కూడా తన జై లవ కుశ టీంకి బాహుబలి హాలిడేస్ ఇచ్చేశాడు. ప్రస్తుతం షూటింగ్ బ్రేక్ ప్రకటించేసిన యంగ్ టైగర్.. తిరిగి మే 6 నుంచి కొత్త షెడ్యూల్ ను స్టార్ట్ చేస్తాడట. నిజానికి మార్చ్ మధ్యలో షూటింగ్ లో స్టార్ట్ చేసిన జూనియర్.. ఎండలను కూడా లెక్క చేయకుండా.. గ్యాప్ లేకుండా షూట్ చేస్తూనే ఉన్నాడు. అందుకే ఓ వారం రోజుల పాటు బ్రేక్ తీసుకోవాలని అనుకున్నాడట.

ఇదే సమయంలోనే బాహుబలి2 కూడా రిలీజ్ ఉండడంతో.. ఎన్టీఆర్ హాలిడేస్ విషయంలో ఇమ్మిడియేట్ గా డెసిషన్ తీసుకుని బ్రేక్ ఇచ్చేసినట్లు తెలుస్తోంది.

,  ,  ,  ,  ,