Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

28-Jun-2017 13:29:09
facebook Twitter Googleplus
Photo

అసలు ఈ లీకేజ్ గురించి మామూలుగా అయితే ఎవ్వరికీ తెలిసేది కాదు గాని.. స్వయంగా ఆ సినిమాకు సంబంధించి పి.ఆర్.ఓ అలాగే ఆ సినిమా ప్రొడ్యూసర్ల ట్విట్టర్ ఎకౌంట్ నుండి.. జై లవ కుశ లీక్ అయిన విషయాన్ని చెప్పడం.. నిందితులను అరెస్టు చేస్తామని చెప్పడం.. ఇవన్నీ ఆ మ్యాటర్ ను బూతద్దంలో వేసి చూపించి మరీ హెడ్ లైన్స్ గా మార్చేశాయి.

ఇకపోతే ఈ లీకేజీలపై లేటెస్టు అప్డేట్ ఏంటంటే.. ఈ సినిమా మొత్తం లీక్ కాలేదట.. కేవలం టీజర్ మాత్రమే లీకైందట. అది కూడానూ పూర్తి స్థాయిలో ఎడిట్ చేయబడిన టీజర్ కాదట.. ఏదో రఫ్ వర్షన్ అంట. ఈ లీకేజీలకు సంబంధించి ఎవరు లీక్ చేసింది కూడా తెలిసిపోయింది. ఏ కంటెంట్ ను లీక్ చేశాడనే సంగతి కూడా వెల్లడైంది. త్వరలో జై లవ కుశ టీజర్ ను విడుదల చేసేందుకు యూనిట్ సిద్ధం అవుతుండగా.. ఈ టీజర్ కు సంబంధించిన రఫ్ కట్ ను లీక్ చేశారట. దీనికి కారణమైన గణేష్ అనే వ్యక్తిని సైబర్ క్రైమ్ అధికారులు ఇప్పటికే అరెస్ట్ చేశారు కూడా. కేసు ఇంకా విచారణ జరుగుతోంది.

అయితే.. లీకైన క్లిప్ అఫీషియల్ క్లిప్ కాకపోవడం.. టీజర్ కు సంబంధించిన రఫ్ కట్ మాత్రమే కావడం.. సినిమాకి సంబంధించిన విశేషాలేవీ బయటకు రాలేదనే వార్త మాత్రం నందమూరి అభిమానులకు ఊరట కలిగించింది.

,  ,  ,  ,  ,  ,