Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

06-Oct-2016 13:23:31
facebook Twitter Googleplus
Photo

ఇజం ఆడియో వేడుక చక్కగా జరిగింది. భారీ ఆడిటోరియాల్లో అనవసర హంగామా.. అర్థం లేని డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఏవీ లేకుండా సింపుల్ గా ఫంక్షన్ చేశారు. అందరూ కూడా చక్కగా మాట్లాడారు. ముఖ్యంగా ఎన్టీఆర్ ప్రసంగం నందమూరి అభిమానుల్ని బాగా అలరించింది. తన అన్నయ్య కళ్యాణ్ రామ్ ను గర్ల్ ఫ్రెండ్ అనడం.. పూరి అంటే తనకెంత ఇష్టమో చెప్పడం ఆకట్టుకుంది. అంతా బాగుంది కానీ.. ఈ ఆడియో వేడుకలో ఒక బ్లాక్ బస్టర్ న్యూస్ బయటికి వస్తుందని ఆశించి వచ్చిన అభిమానులకు మాత్రం నిరాశ తప్పలేదు. ఎన్టీఆర్ తర్వాతి సినిమా ఏదన్న విషయంలో క్లారిటీ రాలేదు.

?జనతా గ్యారేజ్? తర్వాత వక్కంతం వంశీతో సినిమా చేస్తాడనుకున్న ఎన్టీఆర్.. ఆ ప్రాజెక్టును పక్కనబెట్టేసిన సంగతి తెలిసిందే. ఈ లోపు రకరకాల ఊహాగానాలు వచ్చాయి. ఎన్టీఆర్ ఆర్ట్స్ బేనర్ మీద కళ్యాణ్ రామ్ ?బ్రదర్స్? అన్న టైటిల్ రిజిస్టర్ చేయించడంతో అన్నదమ్ముల మల్టీస్టారర్ మీద చాలా ఆశలతో ఉన్నారు అభిమానులు. ఈ చిత్రానికి పూరీనే దర్శకుడు అన్న గుసగుసలు వినిపించాయి. ఈ నేపథ్యంలో ?ఇజం? ఆడియో వేడుకలో ఈ ప్రాజెక్టు గురించి క్లారిటీ ఇచ్చేస్తారని.. అధికారిక ప్రకటన చేస్తారని భావించగా అలాంటిదేమీ లేకుండానే వేడుక ముగించేశారు. పూరి గురించి అంత గొప్పగా చెప్పాడు కానీ... అతడితో తన తర్వాతి సినిమా ఉంటుందా లేదా అన్నది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు తారక్. మరి అతడి తర్వాతి సినిమా ఏదే ఉంటుంది.. ఎవరితో ఉంటుంది.. ఎప్పుడు ప్రకటన వస్తుంది?

,  ,  ,  ,  ,  ,