Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

07-Jul-2015 12:26:01
facebook Twitter Googleplus
Photo

సూటు బూటు ధరించి ... ట్రిమ్డ్ బియార్డ్ తో ఎన్టీఆర్ చాలా స్టయిలిష్ గా మారిపోయాడు. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం కోసం ఎన్టీఆర్ ఈ కొత్త గెటప్పు వేశాడు. ఈ సినిమా షూటింగ్ నిన్న లండన్ నగరంలో ప్రారంభమైంది. సెప్టెంబర్ 20 వరకు భారీ షెడ్యూలును అక్కడే నిర్వహిస్తారు. అనంతరం మరో దేశానికి షిఫ్ట్ అవుతామని, అక్కడ ఇరవై రోజుల షూటింగ్ చేస్తామని చిత్ర నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ తెలిపారు. ఆ తర్వాత మరో ఇరవై రోజులు హైదరాబాదులో షూటింగ్ చేయడంతో టోటల్ గా పూర్తవుతుందని ఆయన చెప్పారు. ఇందులో ఎన్టీఆర్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

,  ,  ,