Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

25-May-2017 14:37:06
facebook Twitter Googleplus
Photo

జూనియర్ ఎన్టీఆర్ వరుసగా ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులు లైన్లో పెడుతున్నాడు. అతను అగ్ర దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్.. కొరటాల శివలతో సినిమాలు ఓకే చేసిన సంగతి తెలిసిందే. కొరటాలతో ఎన్టీఆర్ ఇప్పటికే పని చేశాడు కాబట్టి.. ఆ సినిమాతో పోలిస్తే త్రివిక్రమ్-ఎన్టీఆర్ కాంబినేషన్లో రాబోయే సినిమానే ఎక్కువ ఆసక్తి రేకెత్తిస్తోంది. దశాబ్దం కిందటే స్టార్ డైరెక్టర్ స్టేటస్ సంపాదించిన త్రివిక్రమ్.. ఎన్టీఆర్ తో ఇప్పటిదాకా సినిమా చేయకపోవడం ఆశ్చర్యమే. ఈ కాంబినేషన్ కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఆ ఎదురు చూపులు ఎట్టకేలకు ఫలించాయి. ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లబోతోంది.

ఐతే ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా ఆరంభం కావడానికి ఇంకా చాలా సమయం ఉండగానే ఈ సినిమా కథాంశం గురించి ఆసక్తికర కథనాలు వినిపిస్తున్నాయి. ఇది ఒక పొలిటికల్ థ్రిల్లర్ అని ప్రచారం జరుగుతోంది. త్రివిక్రమ్ తన గత సినిమాలకు పూర్తి భిన్నంగా ఈ చిత్రానికి కథ ఎంచుకున్నాడట. తారక్ ఇందులో యంగ్ పొలిటీషియన్ పాత్రలో కనిపిస్తాడట. అదే సమయంలో ఎంటర్టైన్మెంట్ కు కూడా ఢోకా ఏమీ ఉండదట. భవిష్యత్తులో ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడం ఖాయం అన్న ప్రచారం నేపథ్యంలో ఎన్టీఆరే త్రివిక్రమ్ నుంచి ఇలాంటి కథాంశం

,  ,  ,  ,  ,