Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

22-Jun-2016 13:44:52
facebook Twitter Googleplus
Photo

మెగాబ్రదర్ నాగబాబు కూతురు నీహారిక అరంగేట్ర సినిమా విడుదలకు రంగం సిద్ధమైంది. మరో రెండు రోజుల్లో అంటే ఈ నెల 24న థియేటర్లలోకి ఒక మనసు రానుంది. నాగశౌర్యకు జోడీగా కొణిదెల నీహారిక నటించిన ఈ చిత్రంపై చాలానే పాజిటివ్ బజ్ నెలకొంది. తమ ఇంటి నుంచి తొలిసారిగా హీరోయిన్ గా పరిచయమవుతున్న నీహారికను.. కుటుంబమంతా సపోర్ట్ చేస్తోంది.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఒక మనసు చిత్రాన్ని అందరికంటే ఒకరోజు ముందే మెగాస్టార్ చిరంజీవి చూడనున్నారు. మెగా కుటుంబానికి చెందిన సినిమాలను ఇలా స్పెషల్ స్క్రీనింగ్ వేయించుకుని చూడ్డం చిరుకు అలవాటు. అదే ట్రెండ్ ని కంటిన్యూ చేస్తూ నీహారిక చిత్రాన్ని కూడా తిలకించనున్నారు మెగాస్టార్. జూన్ 23న ప్రసాద్ ల్యాబ్స్ లో స్పెషల్ స్క్రీనింగ్ ఉండనుందని.. దీనికి చిరు ఫ్యామిలీ అంతా అటెండ్ కానున్నారని తెలుస్తోంది.

ఇదే రోజున యూఎస్ఏ యూకే ఆస్ట్రేలియా సింగపూర్ లతో పాటు పలు దేశాల్లో ప్రీమియర్లను ప్రదర్శించనున్నారు. ఆయా దేశాలకు ఇప్పటికే హార్డ్ డిస్క్ లు వెళ్లిపోగా.. స్క్రీనింగ్ కు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. మెచ్యూర్డ్ లవ్ స్టోరీగా ఒక మనసు చిత్రాన్ని రామరాజు దర్శకత్వంలో టీవీ9 మధుర శ్రీధర్ నిర్మాతలుగా తెరకెక్కించా

,  ,  ,  ,  ,