Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

23-Dec-2017 10:19:01
facebook Twitter Googleplus
Photo

ఒక్క క్షణం టీజర్ ఎన్ని ప్రకంపనాలు రేపిందో మనకు తెలిసిందే. ఆ సినిమా తాలూకు సబ్జెక్ట్ అలా ఉందిలే. అల్లు శిరీష్ హీరోగా.. ఎక్కడికిపోతావు చిన్నవాడా ఫేం డైరక్టర్ విఐ ఆనంద్ తీస్తున్న ఈ సినిమా డిసెంబర్ చివర్లో 28న రిలీజ్ అవ్వనుంది. ఆల్రెడీ టీజర్ తో ఆకట్టుకున్న ఈ సినిమా ట్రైలర్ ఇప్పుడు రిలీజైంది. పదండి ఎలా ఉందో చూద్దాం.

నిజానికి మొదటి టీజర్లో ఈ సినిమాలో ఎలా రెండు కపుల్స్ తాలూకు జీవితాలు ఓవర్ లాప్ అవుతున్నాయి అనే సైంటిఫిక్ టాపిక్ ను బాగా చెప్పారు. అయితే అక్కడ ఆ రెండో కపుల్ ఎవరు ఏంటి అనే విషయం మాత్రం రివీల్ చేయలేదు. ఇప్పుడు మాత్రం.. ఈ రెండు జంటల ప్రేమకథను బయటపెట్టేశారు. అల్లు శిరీష్ అండ్ సురభి కెమిస్ర్టీ ఒకెత్తయితే.. మరో ప్రక్కన శ్రీనివాస్ అవసరాలను వశపరుచుకుంటున్న హీరోయిన్ సీరత్ కపూర్ అందాలు మరో సైడ్ అనే చెప్పాలి. శిరీష్ అండ్ సురభి మధ్యలో కెమిస్ర్టీ బాగుంది. మొత్తానికి ఇది కేవలం థ్రిల్లర్ సినిమా అనుకుంటున్న ప్రేక్షకులకు.. ఈ సినిమాలోని లవ్ యాంగిల్ చూసి సినిమాపై ఇంకా అంచనాలు పెరుగుతున్నాయి.

ఆల్రెడీ తన గత సినిమా శ్రీరస్తు శుభమస్తుతో బాగా ఇంప్రెస్ చేసిన అల్లు శిరీష్.. ఈ సినిమాతో ఒక పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టే దిశగా వెళ్ళబోతున్నాడని ఇప్పటికే ట్రేడ్ వర్గాలు అంచనాలు వేస్తున్నాయి

,  ,  ,  ,  ,  ,