Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

24-Jun-2017 12:01:16
facebook Twitter Googleplus
Photo

అమ్మాయి ప్రేమ కోసం పాటలు.. ఆ ప్రేమ వికటిస్తే పాడిన పాటలలో.. ఎక్కువగా యూత్ పాడుకునేది మళ్ళీ మళ్ళీ విన్నవి అంటే.. అవి ఖచ్చితంగా లవ్ బ్రేక్ అప్ పాటలు అయ్యుంటాయి. ఎందుకంటే మన కుర్రాళ్ళకు ఎక్కువగా జరిగేవి బ్రేక్ అప్లే కదా. ప్రేమ గురించి తెలియనితనం లో ప్రేమించి ప్రేయసికు దూరమైన ప్రతి ప్రేమికుడు కోసం లోకల్ హీరో నాని.. తన బాధను చెబుతూ 'వన్స్ అపాన్ టైమ్లో' అని ఒక పాట విడుదల చేశారు. రాబోతున్న కొత్త సినిమా నిన్నకోరి లోనిది ఈ పాట.

కొన్నేళ్ళ కిందట ధనుష్ 3 సినిమాలోని కొలవేరి డి ఎంత ఫేమస్ అయిందో మీకు తెలుసు. ఆ పాటలో అర్ధము గొప్పగా లేకపోయినా ప్రతివాడు పాడుకొని వాడి భాదని చెప్పే చిన్న చిన్న మాటలతో ఉండటం అందరికీ అంతలా నచ్చేసింది. దానికి తగ్గ దరువు వేశాడు అనిరుధ్. ఇప్పుడు మన తెలుగు స్టైల్ లో నాని శైలి లో వన్స అప్ ఆన్ టైమ్ లో అని ఒక బ్రేక్ అప్ సాంగ్ కూడా అంతే హంగామా చేస్తోంది. వైజాగ్ బీచ్ లో పిల్లను చూసి- ఐ లవ్ యు చెప్పి – అల్లి బిల్లీ గా నడుము తిప్పి- మాయమైపోయింది అని చెబుతూ కింగ్ లాంటి కుమార్ గాడిని ప్యాక్ అప్ చేయించింది చివరకు చుక్కలు చూపించి చుక్క మిగిలిచ్చింది అంటూ.. పాట అదరగొట్టేశారు. సరదాగా పాడుకోవడానికి బ్రేక్ అప్ ను కూడా సెలిబ్రెట్ చేసుకోవడానికి బాగా పనికివస్తుంది. గోపిసుందర్ అందించిన ట్యూన్ అదిరిందనే చెప్పాలి.

నిన్నుకోరి సినిమాలో నాని హీరోగా నివేథ థామస్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఆది ఒక రోల్ చేస్తున్నాడు. ఈ సినిమా నుండి ఇప్పటికే అడిగా అడిగా అనే పాట జనాల్లోకి బాగానే చేరింది. ఇప్పుడు వన్స్ అపాన్ టైమ్లో అనే పాటతో నిన్నుకోరి టీమ్ మళ్ళీ ఇంప్రెస్ చేశారు

,  ,  ,  ,  ,