Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

19-Apr-2016 12:41:37
facebook Twitter Googleplus
Photo

నాగార్జున-కార్తీల క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన ఊపిరి సినిమా నాగార్జునకు ఈతరంలో ఉన్న క్రేజ్‍ను రెట్టింపు చేస్తూ ఆయనకు హ్యాట్రిక్ హిట్ తెచ్చిపెట్టిన విషయం తెలిసిందే. విడుదలైన మొదటి షో నుంచే సూపర్ పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఆ తర్వాత ఎక్కడా పడిపోకుండా రోజురోజుకీ కలెక్షన్స్ పెంచుకుంటూ నాలుగో వారం కూడా అదే జోరు కొనసాగిస్తూ ఉండడం విశేషంగా చెప్పుకోవచ్చు. నాగార్జున టాప్ 3 సినిమాల్లో ?ఊపిరి? ఒకటిగా నిలిచింది.
ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా యూఎస్ బాక్సాఫీస్ వద్ద నాలుగోవారం కూడా స్ట్రాంగ్‌గానే నిలబడి మంచి కలెక్షన్స్ సాధిస్తోంది. నాలుగో వారాంతం ముగిసేసరికి 1,559,065 డాలర్లతో (10.37కోట్ల రూపాయలు) సినిమా నాగార్జున కెరీర్లో యూఎస్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ క్లాస్ కామెడీ డ్రామాకు అన్నిచోట్లా అద్భుతమైన రెస్పాన్స్ రావడం ఈ కలెక్షన్స్‌కి కారణంగా చెప్పుకోవచ్చు. తమన్నా మరో ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాను పీవీపీ సినిమా నిర్మించింది.

,  ,  ,  ,  ,  ,