Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

19-Apr-2016 11:06:53
facebook Twitter Googleplus
Photo

సినిమా ఎలా ఉన్నా.. ఆడియన్స్ అరిచి గోల పెట్టినా.. థియేటర్స్ నుంచి తీసేసినా.. ప్రచారం చేసుకోవడానికి మాత్రం హిట్ - సూపర్ హిట్ - బ్లాక్ బస్టర్ - సెన్సేషనల్ హిట్.. ఇలా చాలానే పదాలతో ప్రచారం చేసేస్తూ ఉంటారు. ఆ మూవీ ఏ థియేటర్ లో ఆడుతోందో కూడా జనాలకు తెలియని స్టేజ్ లో ఉన్నా.. ఈ హిట్టు ప్రచారం మాత్రం కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ సర్దార్ గబ్బర్ సింగ్ వంతు వచ్చింది.

మొదటి రోజున రిలీజింగ్ టీజర్స్ - ట్రైలర్స్ తో దంచేశారు. వీకెండ్ ముగిసే వరకూ.. పవర్ ప్యాక్డ్ హిట్ అంటూ ట్రైలర్ల ద్వారా ప్రచారం చేశారు. మరి మూడ్రోజుల్లో 40 కోట్లకు పైగా వసూళ్లంటే అది ఖచ్చితంగా పవర్ స్టార్ మహిమ - పవర్ ప్యాక్డ్ అనాల్సిందే. ఆ తర్వాతే పరిస్థితి మరిపోయింది. నెక్ట్స్ వీకెండ్ వచ్చేసరికి పరిస్థితి మరింతగా దిగజారింది. దీంతో ట్రైలర్లలో పవర్ అనే మాటను ఉంచి హిట్ అనే మాటను తొలగించారు.

ఇప్పుడు సర్దార్ ట్రైలర్లలో కనిపిస్తున్న వాక్యం ఏంటంటే.. "పవర్ ప్యాక్డ్ యాక్షన్ ఎంటర్టెయినర్" అని మాత్రమే. ఎక్కడా కూడా హిట్ అనే మాట వాడుకుండా ప్రచారం చేస్తున్నారు నిర్మాతలు. సినిమా ఫెయిల్ అవ్వడం కరెక్టే కానీ.. ఆ విషయాన్ని ఇంత పబ్లిక్ గా ఒప్పుకోవాల్సిన అవసరం అయితే లేదు. అయినా సరే.. పవన్ ఆదేశాలమేరకు ఇలా హిట్ అనే మాటను తొలగించేశారని సమాచారం.

,  ,  ,  ,  ,  ,