Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

31-Mar-2017 16:20:42
facebook Twitter Googleplus
Photo

ఒక ఫ్యామిలీకి చెందిన హీరో సినిమాలో.. అదే ఫ్యామిలీకి చెందిన స్టార్ హీరో రెఫరెన్సులు కనిపిస్తే ఆశ్చర్యమేమీ లేదు. కానీ ఒక స్టార్ హీరో సినిమాలో.. ఆ హీరోతో సంబంధం లేని మరో స్టార్ రెఫరెన్సులు కనిపించడం మాత్రం అరుదైన విషయమే. గురు సినిమాలో ఆ చిత్రమే చోటు చేసుకుంది. విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ రెఫరెన్సులు బోలెడు కనిపించాయి. కనీసం ఐదుసార్లు పవన్ కళ్యాణ్ రెఫరెన్స్ కనిపిస్తుంది ఈ సినిమాలో. ఇందులో కథానాయిక పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని. ఆమె మాట.. నడత అన్నింట్లోనూ పవన్ ప్రభావం ఉంటుంది. పవన్ కటౌట్ చూస్తే ఆమె ఊగిపోతుంది.

పవన్ మెడ మీద రుద్దుకునే మేనరిజం.. హా హా అంటూ ఎగరేసి మాట్లాడే మేనరిజం.. ఇంకా చాలా పవన్ ముచ్చట్లే ఉన్నాయి సినిమాలో. గబ్బర్ సింగ్ కటౌట్.. పోస్టర్ చాలాసార్లే కనిపిస్తాయిందులో. తమిళంలో హీరోయిన్ ధనుష్ ఫ్యాన్ అయితే.. ఇక్కడ ధనుష్ బదులు పవన్ వచ్చాడన్నమాట. ఇలా మరో సినిమాలో పవన్ రెఫరెన్సులు కనిపిస్తే థియేటర్లు ఎలా దద్దరిల్లుతాయో తెలిసిందే. గురు థియేటర్లలోనూ అదే జరిగింది. వెంకీ తొలిసారి కనిపించినపుడు ప్రేక్షకులు ఎలా సందడి చేశారో.. పవన్ దర్శనమిచ్చినపుడూ అంతే. ఇలా వేరే స్టార్ హీరో రెఫరెన్సులకు ఒప్పుకున్నందుకు వెంకీని అభినందించాల్సిందే. వెంకీ గత సినిమాలు కూడా కొన్నింట్లో ఇలా వేరే హీరోల రెఫరెన్సులు గమనించవచ్చు

,  ,  ,  ,  ,  ,