Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

09-Jul-2016 12:01:01
facebook Twitter Googleplus
Photo

దర్శకుడు శేఖర్ కమ్ములది సెపరేట్ స్కూల్. చిత్రీకరణ మొదలైన తర్వాత కథలో మార్పులు-చేర్పులు చేయడం, లొకేషన్‌లో అప్పటికప్పుడు డైలాగులు రాయడం వంటివి ఉండవు. పక్కా బౌండ్ స్క్రిప్ట్‌తో షూటింగ్‌కి వెళతారాయన. అంతకు ముందే ?ఎలా నటించాలో? ఆర్టిస్టులకు వివ రిస్తూ వర్క్‌షాప్స్ నిర్వహిస్తారు. వరుణ్‌తేజ్, సాయి పల్లవి జంటగా ?దిల్?రాజు నిర్మాణంలో రూపొందనున్న చిత్రానికి కూడా శేఖర్ కమ్ముల ఇదే పద్ధతిని అనుసరిస్తున్నారు.

మీరు చూస్తున్న ఈ ఫొటో హైదరాబాద్‌లో వర్క్‌షాప్స్ జరుగుతున్నప్పటిదే. అన్నట్లు.. ఈ ఫొటో చూస్తుంటే పవన్ కల్యాణ్ గుర్తుకు వచ్చే అవకాశం ఉంది. ఫొటోలో శేఖర్, పల్లవి మెడ మీద చెయ్యి పెట్టుకున్నట్లుగా పెట్టుకోవడం పవన్ స్టైల్. దర్శకుడు శేఖర్ కమ్ములకి పవన్ అంటే ఇష్టమే! అదే స్టైల్ ఇక్కడ కనిపించడం కాకతాళీయమే అయినా చూడ్డానికి బాగుంది కదూ. ఆ సంగతలా ఉంచితే.. అమెరికా అబ్బాయికి, తెలంగాణ అమ్మాయికి మధ్య జరిగే ప్రేమకథతో సాగే ఈ చిత్రం షూటింగ్ ఈ నెలాఖరున ప్రారంభమవుతుంది.

,  ,  ,  ,  ,