Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

17-Aug-2017 11:25:25
facebook Twitter Googleplus
Photo

రూమర్లు రావడం ఒకెత్తు అయితే.. వాటిని ఖండించుకుంటూ పోవడం మరో ఎత్తు. ఎందుకంటే అలా చేసిన ప్రతీసారి సదరు సినిమాకు మైలేజ్ పెరుగుతుంది. అయితే పవన్ కల్యాణ్ వంటి హీరో సినిమాకు అలాంటివి అక్కర్లేదు కాని.. ఇక్కడ మాత్రం #పీకె25 గురించి అటు రూమర్ రావడం ఇటు ఖండించేయడం ఒకేసారి జరిగిపోతుంది. బడ్జెట్ రూమర్ల గురించి మాట్టాడట్లేదు కాని.. ఇలా టైటిల్ రూమర్ల గురించి మాత్రం తెగ చెబుతున్నారు.

ఇంజనీర్ బాబు.. దేవుడే దిగి వచ్చినా.. గోకుల కృష్ణుడు.. వంటి పేర్ల తరువాత ఇప్పుడు రాజు వచ్చినాడే అనే టైటిల్ తెగ పాపులర్ అయ్యింది. త్రివిక్రమ్ డైరక్షన్లో వస్తున్నీ ఈ ల్యాండ్ మార్క్ సినిమా కోసం ఆ పేరును సెలక్ట్ చేశారంటూ అందరూ అనుకున్నారు. కాని వాస్తవానికి ఇందులో అస్సలు ఏ మాత్రం నిజంలేదంటూ ఆ సినిమా టీమ్ క్లారిటీ ఇచ్చేసింది. అస్సలు ఇంతవరకు ఒక్కటంటే ఒక్క టైటిల్ కూడా ఫిక్స్ చేయలేదంట. మీరెన్ని రూమర్లను చెప్పినా కూడా మేం టైటిల్ చెప్పేవరకు వెయిట్ చేయండి అంటోంది టీమ్.

ఇకపోతే సినిమా బడ్జెట్ 120 కోట్లు అయ్యిందని ఒకసారి.. లేదంటే 10 కోట్లతో సెట్ వేశారని ఒకసారి చాలా రూమర్లు వచ్చాయి. అయితే అవన్నీ తప్పారైటా అనేది మాత్రం ఎప్పుడూ చెప్పలేదు.

,  ,  ,  ,  ,