Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

24-Jun-2017 10:44:34
facebook Twitter Googleplus
Photo

పవన్ కళ్యాణ్ గత చిత్రం కాటమరాయుడు జనాలను ఆకట్టుకోలేకపోయింది. అయితే.. ఇప్పుడు వెంటవెంటనే సినిమాలు చేస్తున్న పవర్ స్టార్.. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో కొత్త మూవీని స్టార్ట్ చేసేయడమే కాదు.. ఫుల్ స్పీడ్ లో షూటింగ్ చేసేస్తున్నారు కూడా. ఎక్కడా షూటింగ్ విశేషాలు బైటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటూ.. హైద్రాబాద్ లోని స్టూడియోస్ లో నిర్మించిన సెట్స్ లో పవన్-త్రివిక్రమ్ ల మూవీ షూటింగ్ జరుగుతోంది.

ఇప్పటికి దాదాపు 3 నెలలుగా షూటింగ్ జరుగుతుండగా.. అనుకున్నదానికంటే వేగంగా పిక్చరైజేషన్ జరుగుతోందని అంటున్నారు. మరోవైపు ఈ క్రేజీ మూవీకి బిజినెస్ కూడా మహా క్రేజీగా జరిగిపోతోందని అంటున్నారు. టాలీవుడ్ లో ఈ చిత్రం కొత్త బెంచ్ మార్క్ దిశగా దూసుకపోతోందని తెలుస్తోంది. కేవలం కోస్తా జిల్లాల వరకే పవన్ నెక్ట్స్ మూవీకి 50 కోట్ల రూపాయల బిజినెస్ చేసినట్లు చెబుతున్నారు. మొత్తం తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమా దాదాపు 110 కోట్లకు బిజినెస్ చేస్తుందనే అంచనాలు వినిపిస్తున్నాయి. ఇక దేశవ్యాప్తంగా జరిగే బిజినెస్.. శాటిలైట్ అండ్ డిజిటల్ రైట్స్.. ఓవర్సీస్ మార్కెట్స్ తో కలుపుకుని పవన్-త్రివిక్రమ్ ల సినిమా 150 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయనుందని తెలుస్తోంది.

ఒక్క తెలుగు వెర్షన్ తోనే ఈ స్థాయికి మించి బిజినెస్ చేసిన సినిమా ఇప్పటివరకూ బాహుబలి2 ఒక్కటే

,  ,  ,  ,  ,  ,