Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

20-Apr-2016 15:34:54
facebook Twitter Googleplus
Photo

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా ఏప్రిల్ 8న భారీ ఎత్తున విడుదలైన విషయం తెలిసిందే. తారాస్థాయి అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అంచనాలను అందుకోలేక బాక్సాఫీస్ వద్ద పరాజయాన్నే మూటగట్టుకుంది. రిలీజ్‌కి ముందు భారీ మొత్తానికి ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులను సొంతం చేసుకున్న పలువురు డిస్ట్రిబ్యూటర్స్, చాలాచోట్ల నష్టాలను చవిచూశారు. ఈ నేపథ్యంలోనే తమ పరిస్థితిని వివరించేందుకు డిస్ట్రిబ్యూటర్స్ పవన్‌ను కలిశారట.
ఈ సందర్భంగా పవన్, వారికి తన తదుపరి సినిమాతో ఈ నష్టాలను పూడ్చేలా సన్నాహాలు చేస్తానని మాటిచ్చారట. ఆ సినిమా ద్వారా సర్దార్‌తో నష్టపోయిన వారికి అండగా నిలుస్తానని మాటిచ్చినట్లు తెలుస్తోంది. ఇక పవన్ తన కొత్త సినిమాను ఎస్.జె.సూర్య దర్శకత్వంలో చేస్తున్నారు. సర్దార్ నిర్మాత అయిన శరత్ మరారే ఈ సినిమాను కూడా నిర్మిస్తున్నారు. త్వరలోనే సినిమా సెట్స్‌పైకి వెళ్ళనుంది.

,  ,  ,  ,  ,  ,