Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

21-Oct-2017 13:17:36
facebook Twitter Googleplus
Photo

ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి భారీ విజయాన్ని అందుకున్న చిత్రం పెళ్లి చూపులు. తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విజయ్ సాయి దేవరకొండ అండ్ రీతూ వర్మ నటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా సాధించిన విజయం పరభాషా ప్రముఖులకు కూడా తెలిసింది. దీంతో సినిమాను రీమేక్ చెయ్యాలని అనుకుంటున్నారు.

మొదట పెళ్లి చూపులు రీమేక్ బాలీవుడ్ లో తెరకెక్కబోతోంది. మొన్నటి వరకు పలు రకాల హీరోల పేర్లు వినిపించగా ఫైనల్ గా కుర్ర హీరో జాకీ భగ్నానీ పెళ్లి చూపులు సినిమాలో హీరోగా సెలక్ట్ అయ్యాడు. ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ కి ఇంకా టైటిల్ ని ఫిక్స్ చెయ్యలేదు. ప్రముఖ దర్శకుడు నితిన్ కక్కర్ ఈ రీమేక్ ను తెరకెక్కిస్తున్నాడు. తెలంగాణలోని లోకల్ లాగ్వేజ్ తో పెళ్లి చూపులు సినిమాకి ప్రత్యేక గుర్తింపు దక్కింది. రెండు నేషనల్ అవార్డులు కూడా దక్కాయి. అయితే హిందీలో కూడా కొంచెం బాలీవుడ్ ప్రేక్షకుల అభిరుచికి తగ్గటు సినిమాను తెరకెక్కించడానికి స్క్రిప్ట్ వర్క్ చేసుకున్నాడట దర్శకుడు.

అయితే అక్కడ గుజరాతీ బ్యాక్ డ్రాపులో తీస్తారట. గుజ్జూస్ కి వంటల బాగా ఇష్టం కాబట్టి.. సినిమాలో ఉన్న మూవింగ్ హోటల్ థీమ్ సెట్ చేయడం ఈజీ అవుతుందని.. అలా సెట్ చేశారట.

,  ,  ,  ,  ,