Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

16-May-2017 12:51:14
facebook Twitter Googleplus
Photo

ఇప్పటివరకు బాహుబలి 2 బాక్సాఫీస్ దగ్గర ఎటువంటి ప్రభంజనం సృష్టిస్తోంది మనం కళ్లారా చూస్తున్నాం. ఈ సినిమాతో ఏకంగా ఇప్పటివరకు ఏ ఇండియన్ సినిమాకూ సాధ్యపడని 1500 కోట్ల క్లబ్ అనే ఒక కొత్త చరిత్ర సృష్టించడం జరిగింది. అయితే ఈ సినిమాను పైరసీ కూడా అంతే స్పీడుగా చేసేశారు తెలుసా. ఒరిజినల్ సినిమాటిక్ ఫీల్ మిస్సవ్వకూడదని చాలామంది ఇప్పటికే ధియేటర్లలోనే సినిమాను చూశారు కాని.. అచ్చం ఒరిజినల్ డివిడి ప్రింట్ లా ఉన్న పైరసీ కాపీ ఒకటి ఇప్పుడు చెక్కర్లు కొడుతోంది.

అయితే ఈ పైరసీకి పాల్పడింది తామేనని.. తమకు 2 కోట్లు డబ్బులు చెల్లించకపోతే వెంటనే ఈ పైరసీ ప్రింట్ ను ఇంకా విరివిగా అందరికీ అందుబాటులోకి తెచ్చేస్తామంటూ ఒక ఆన్ లైన్ పైరేట్స్ గ్రూప్ హెచ్చరించింది. ఈ బ్లాక్ మెయిల్ తో ఎలర్ట్ అయిన బాహుబలి 2 నిర్మాతలు.. కామ్ గా పోలీస్ కంప్లయింట్ ఇచ్చేశారు. వెంటనే రంగంలోకి దిగిన హైదరాబాద్ సైబర్ సెల్ టీమ్.. పాట్నాలో ఒక క్రిమినల్ ను అతని అనుచరులను ఆరెస్టు చేశారు. రోహిత్ వర్మ అనే సైబర్ నేరగాడు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ నిందితులను రేపు హైదరాబాద్ తీసుకురానున్నారు.

ఇకపోతే ఎవరెన్ని వార్నింగులు ఇచ్చినా.. ఎలాంటి పైరసీలకు పాల్పడినా కూడా.. బాహుబలి 2 మాత్రం బాక్సాఫీస్ దగ్గర సింపుల్ గా 1500 కోట్లను వసూలు చేయగలదని నిరూపించింది

,  ,  ,  ,  ,