Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

28-Nov-2016 10:39:50
facebook Twitter Googleplus
Photo

పిట్టగోడ ఫస్ట్ లుక్కే కాదు.. ఫస్ట్ టీజర్ కూడా నేచురల్ స్టార్ నానినే లాంచ్ చేశాడు. అంతే కాదు.. ఈ టీజర్ కు నానినే వాయిస్ కూడా ఇచ్చాడు. నాని వాయిస్ తో మొదలైన టీజర్ ఆసక్తికరంగా ఉంది. ఈ కథ కరీంనగర్ జిల్లా గోదావరిఖని బ్యాక్ డ్రాప్ లో సాగుతుంది. ఆ టౌన్లో తెలంగాణ ప్రభుత్వం సకల జన సర్వే నిర్వహిస్తే.. అందరూ ఎవరి పనులు వాళ్లు చేసుకుంటున్నారని.. ఓ నలుగురు కుర్రాళ్లు మాత్రమే పనీ పాటా లేని వాళ్లుగా తేలారని నాని ఇచ్చే వాయిస్ ఓవర్ తో టీజర్ మొదలవుతుంది. ఆ నలుగురిలో ఒకరు హీరో.. మిగతా వాళ్లు అతడి ఫ్రెండ్స్ అన్నమాట.

ఈ ముగ్గురికీ పిట్టగోడ మీద కూర్చుని కబుర్లు చెప్పుకోవడం అలవాటు. అలా ముచ్చట్లు చెప్పుకుంటున్న టైంలో స్టేషనరీ షాపెక్కడ అంటూ హీరోయిన్ వచ్చి హీరోను అడుగుతుంది. అక్కడి నుంచి వాళ్ల పరిచయం మొదలై.. ?పిట్టగోడ? కథ ప్రేమకథగా మారుతుంది. అష్టా చెమ్మా.. ఉయ్యాల జంపాల లాంటి సినిమాలతో అభిరుచి ఉన్న నిర్మాతగా పేరు తెచ్చుకున్న రామ్మోహన్ టేస్టు.. ?పిట్టగోడ? టీజర్లోనూ కనిపిస్తోంది. ఇదొక న్యూ వేవ్ మూవీలాగా ఉంది. విశ్వనాథ్ రాచకొండ.. పునర్ణవి జంటగా నటిస్తున్న ఈ చిత్రంతో అనుదీప్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ?ప్రాణం? కమలాకర్ సంగీతాన్నందిస్తున్నాడు. సురేష్ బాబు సమర్పణలో ఈ చిత్రం రూపొందింది.

,  ,  ,  ,  ,  ,