Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

18-Sep-2017 15:55:45
facebook Twitter Googleplus
Photo

క్రేజ్ తెచ్చుకున్నాక అందాల భామలకు అనుకున్నదే తడవుగా లగ్జరీలు వచ్చి వాలిపోవడం పెద్ద వింతేమీ కాదు. కానీ నిర్మాతలు సమకూర్చే ఆయా సదుపాయాలన్నీ సినిమా రిలీజ్ అయ్యే వరకే. అదే విలాసాలు సొంతం కావాలంటే మాత్రం కాసులు ఖర్చుపెట్టాల్సిందే.

ఇక్కడే చాలామంది వయ్యారి భామలు ఆగిపోతుంటారు కానీ.. కొంతమంది తమ కలను నెరవేర్చుకునేందుకు బాగానే ఖర్చు చేసేస్తుంటారు. డీజే-దువ్వాడ జగన్నాధం మూవీతో టాలీవుడ్ ఆడియన్స్ తో పాటు మేకర్స్ ను కూడా మెప్పించేసిన బ్యూటీ పూజా హెగ్డే. అంతకు ముందే ఈమె తెలుగు సినిమాలో నటించినా.. డీజేతో గ్లామర్ డాల్ గా వచ్చిన క్రేజ్ వేరు. ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్ తో నటించేందుకు భారీ మొత్తాన్నే పుచ్చుకున్న ఈ భామకు.. తెలుగుతో పాటు హిందీలోను పలు క్రేజీ ఆఫర్స్ చేతిలో ఉన్నాయి. ఇంతగా చేతికి ఫ్యాన్సీ అమౌంట్స్ అందుతుండడంతో.. తన చిరకాల కోరిక అయిన కాస్ట్లీ మోడల్ బీఎండబ్ల్యూ కార్ కొనేసి తనకు తానే గిఫ్ట్ ఇచ్చేసుకుంది.

అంతే కాదు.. విలాసవంతమైన ఆ కారుపై వయ్యారంగా కూర్చుని పోజ్ ఇచ్చి.. ఓ ఫోటోను నెట్ లో పెట్టేసింది పూజా హెగ్డే.

,  ,  ,  ,  ,