Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

08-Sep-2016 12:23:34
facebook Twitter Googleplus
Photo

కొత్త హీరోయిన్ను రంగంలోకి దించాలనే స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ కోరిక. కాని తాను రాసుకున్న దువ్వాడ జగన్నాథమ్ క్యారెక్టర్ పలానా హీరోయిన్నుతో రొమాన్స్ చేస్తేనే సీను బాగా పండుతుందని దర్శకుడు హరీశ్ శంకర్ ఎప్పుడో రాసి పెట్టుకున్నాడట. ఇప్పుడు ఫిలిం నగర్లో వినిపిస్తున్న ఈ కొత్త రూమర్ ఓసారి వినుకుందాం లగెత్తండి.

నిజానికి ఏ హీరోయిన్ కూడా ఫైనల్ కాలేదని ఆల్రెడీ ప్రొడక్షన్ హౌస్ క్లారిటీ ఇచ్చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు తొలుత మాత్రం వరుణ్ తేజ్ సరసన ముకుంద సినిమాలో నటించిన పూజా హెగ్డే హీరోయిన్ అనుకున్నారులే. కాని తరువాత ఆమె పేరు వినిపించలేదు. పైగా మొహంజొదారో సినిమా ఊపులో ఉన్న పూజ కూడా బాగానే కథలు చెప్పిందట. కాని ఇప్పుడు ఆమె కూడా ఈ ఆఫర్ వస్తే బాగుండని ఎదరు చూస్తుండటంతో.. ఆమెతోనే చేద్దామని హరీశ్ శంకర్ కాస్త గాట్టిగానే పూజ చేస్తున్నాడట.

ఇకపోతే గతంలో స్కిన్ షో వంటి అంశాలలో తెగ ఆంక్షలు విధించిన పూజా హెగ్డే.. ఇప్పుడు డిజాష్టర్ మూవీ మొహంజొదారో సినిమాలో ఆ రేంజులో రెచ్చిపోయి అందాలు ఆరబోసిన తరువాత.. మరి తెలుగులో ఆంక్షలు పెడతానంటే మనోళ్ళు ఒప్పుకుంటారా? లెటజ్ సీ.

,  ,  ,  ,  ,