Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

14-Jun-2017 11:30:05
facebook Twitter Googleplus
Photo

పై ఫోటోలో తన పరువాలను ఆరబోసింది ఎవరో కాదు.. డస్కీ బ్యూటి పూజా హెగ్డే. ఈ మధ్యనే నలుపు రంగులో ఉండటం పెద్ద తప్పేమీ కాదంటూ మినిమల్ మేకప్ తో బికినీల్లో తన పరువాలను ఆరబోసింది ఈ పిల్ల. ఆ తరువాత కట్ చేస్తే డిజె దువ్వాడ జగన్నాథమ్ సినిమాలో హీరోయిన్ అయిపోయింది. అసలే పెద్ద హీరోతో ఛాన్స్ కాబట్టి.. ఆమె అందాల ఆరబోత కూడా అదే రేంజులోనే ఉంది.

అల్లు అర్జున్ హీరోగా హరీశ్ శంకర్ డైరక్షన్లో రూపొందిన డిజె సినిమాలో.. సీటిమార్ సాంగులో అమ్మడు ఈ రేంజులో తన వయ్యారాలను ఒక రేంజులో వడ్డించిందట. ఆ అందచందాల తాలూకు వివరాలను చెబుతూ.. తనే ఈ ఫోటోను షేర్ చేసింది. ఇది చూసినవారెవరైనా కూడా దువ్వాడ గాళ్ ఫ్రెండ్ కిరాకే అనకుండా ఉండలేరుగా. మెరిసే మెరుపా..అంటూ మొదలై.. సీటి మార్ సీటి మార్ అంటూ సాగే ఈ పాటలో అమ్మడు తన డ్యాన్స్ స్టెప్పులతో మనస్సు దోచేసిందట. ఆ పాట కోసం బాగా కష్టపడి మరీ అల్లు అర్జున్ తో పోటీగా స్టెప్పులు వేశాను అని చెప్పుకొచ్చింది పూజా హెగ్డే.

ఆల్రెడీ బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా కోసం ఏకంగా 1.5 కోట్లు తీసుకుంటోంది ఈ సుందరి అనే టాక్ ఉండనే ఉంది. ఒకవేళ డిజె దువ్వాడ జగన్నాథమ్ సినిమా హిట్టయిపోయి.. అమ్మడికి గ్లామర్ డాల్ గా పేరొచ్చేస్తే మాత్రం.. అంతకంటే పైకం కావాలంటే ఇక చెట్టెక్కి కూర్చుంటుందేమో అని ఇప్పుడు ఫిలిం నగర్ బాబులు కంగారుపడుతున్నారు.

,  ,  ,  ,  ,  ,