Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

29-Jun-2017 14:27:38
facebook Twitter Googleplus
Photo

పూజా హెగ్డే.. ప్రస్తుతం టాలీవుడ్లో మార్మోగిపోతున్న పేరిది. తెలుగులో తొలి సినిమా ఒక లైలో కోసం లో.. మలి సినిమా ముకుంద లో అమ్మడు ఎంత పద్ధతిగా కనిపించిందో తెలిసిందే. కానీ ఈ సినిమాలతో వచ్చిన క్యూట్ ఇమేజ్ ను కొనసాగించడానికి పూజా ఇష్టపడలేదు. తన లేటెస్ట్ మూవీ దువ్వాడ జగన్నాథం లో పూజా ఒక్కసారిగా గ్లామర్ డోస్ బాగా పెంచేసింది. ఈ సినిమాకు పూజా ప్రత్యేక ఆకర్షణ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఓవైపు బికినీ అందాలతో.. మరోవైపు సెక్సీ డ్యాన్సులతో కుర్రాళ్ల హృదయాల్ని కొల్లగొట్టేసింది పూజా. ఆ రకంగా సినిమాకు పెద్ద ప్లస్ గా మారిన పూజా.. సినిమా విడుదలకు ముందు తర్వాత కూడా ప్రమోషన్లలో తన వంతు పాత్ర పోషిస్తూ మిగతా హీరోయిన్లకు పాఠాలు నేర్పిస్తోంది.

ఈ మధ్య కాలంలో ఏ పెద్ద సినిమా హీరోయిన్ కూడా పూజా స్థాయిలో ప్రమోషన్ కార్యక్రమాలకు రాలేదంటే అతిశయోక్తి కాదు. విడుదలకు ముందు ఆడియో వేడుక.. రిలీజ్ తర్వాత థ్యాంక్స్ మీట్.. మధ్య మధ్యలో ప్రింట్ మీడియాకు.. ఎలక్ట్రానిక్ మీడియాకు ఇంటర్వ్యూలు.. ఇలా డీజే కోసం చాలా సమయమే వెచ్చించింది పూజా. ఈ కార్యక్రమాలకు వచ్చేటపుడు ఆమె తయారై వస్తున్న తీరు కూడా అందరినీ ఆకర్షిస్తోంది. ఇక్కడితో ఆగకుండా అమెరికాలోనూ డీజేను ప్రమోట్ చేయడానికి వెళ్తోంది పూజా. ఇది చూసి పూజాను ప్రస్తుత హీరోయిన్లందరూ ఆదర్శంగా తీసుకుని సినిమాకు తోడ్పాటు అందించాలని అభిప్రాయపడుతున్నారు.

,  ,  ,  ,