Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

27-Feb-2016 14:50:27
facebook Twitter Googleplus
Photo

అఫ్ కోర్స్.. మనం కొత్తగా చెప్పేదేముంది. ఆల్రెడీ ప్రజాసేవ కోసం సినిమాలను వదిలేస్తానంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ''జనసేన'' ఆవిర్భావ సభలోనే చెప్పేశాడు. సో.. 2019 ఎన్నికల నాటికి పోటీ గురించి ఆలోచిస్తాను అన్నాడు కాబట్టి.. ఖచ్చితంగా 2018లో ఏదైనా సినిమా వస్తే అదే ఆఖరి సినిమా అయ్యే ఛాన్సుంది.

కొత్తగా ఫిలిం నగర్ లో వినిపిస్తున్న బాతాకానీ ఏంటంటే.. పవన్ త్వరత్వరగా ఒక 100 కోట్లు సంపాదించేసి.. వెంటనే సినిమాలకు స్వస్తీ చెప్పాయలని అనుకుంటున్నాడట. అప్పుడు ఫుల్ టైమ్ రాజకీయాల మీదనే ఫోకస్ చేస్తాడట. మరి 100 కోట్లు ఎందుకు? రాజకీయాల్లో పార్టీలు నడపాలంటే.. మెన్ అండ్ మెటీరియల్ పవర్ యొక్క అవసరం ఏంటో తెలిసిందేగా. అందుకే తనే సొంతంగా ఒక నిధిని ఏర్పాటు చేసుకుని.. అప్పుడు రంగంలోకి దిగుతాడట. ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కాని.. ఎప్పుడైతే పవన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ.. ఈరోస్ వంటి సంస్థలకు తన సినిమాలను అమ్మేస్తున్నాడో.. జనాలు మాత్రం ఇలాంటి రూమర్లను తెగ నమ్మేస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు 2018 సంక్రాంతికి వచ్చే సినిమానే పవన్ ఆఖరి సినిమా అంటూ కూడా నమ్మించేశారు.

సర్లేండి.. ప్రస్తుతం సర్దార్ సినిమాను పనిచేసే పనిలో బిజీగా ఉన్నాడు మన గబ్బర్ సింగ్. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏప్రిల్ 8 మిస్సయ్యే ఛాన్సే లేదట.

,  ,  ,  ,