Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

01-Aug-2017 15:31:06
facebook Twitter Googleplus
Photo

బాహుబలి సినిమాతో మన తెలుగు మార్కెట్ పెరగడంతో పాటుగా ఇంటర్నేషనల్ మార్కెటింగ్ పద్దతులు తెలిసాయి మన సినిమా వాళ్ళకి. బాహుబలి సినిమా ఘనవిజయంతో ఆ సినిమాలో నటించే నటి నటులు కూడా అంతే పేరు వచ్చింది. ప్రభాస్ ఈ సినిమా తో నేషనల్ స్టార్ గా మారాడు. ఈ సినిమా మన దేశంలోనే కాకుండా చాలా దేశాలలో విడుదల కావడంతో ప్రభాస్ కు బయట కూడా మంచి గుర్తింపు వచ్చింది.

ఇప్పుడు ఈ క్రేజ్ ని ప్రభాస్ రాబోతున్న సినిమాలు బాగనే వాడుకుంటున్నాయి. ప్రభాస్ హీరోగా ఇప్పుడు ఒక రొమాంటిక్ ప్రేమ కథ షూటింగ్ మొదలుకాబోతుంది. ఈ సినిమాను రాధాకృష్ణ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ రొమాంటిక్ ప్రేమ కథ ను మన ఇండియా లో కన్నా ముందే కొన్ని ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లలో ప్రీమియర్ వేయడానికి ప్లాన్ చేస్తునట్లు తెలుస్తుంది. ఈ సినిమా కూడా ఎక్కువ శాతం యూరోప్ లోనే షూట్ చేయడం జరుగుతుంది అని చెబుతున్నారు. అక్కడ అందమైన లొకేషన్లు మధ్య ఈ ప్రేమ కథ మరింత అందంగా ఉండబోతోందట.

బాహుబలి సినిమాతో మన తెలుగు సినిమాకు కొన్ని యూరోప్ దేశాలలో మంచి క్రేజ్ ఏర్పడింది. ఈ సినిమాలో బాహుబలిగా నటించిన ప్రభాస్ తో అక్కడ ప్రేక్షకులు బాగానే కనెక్ట్ అయ్యారు దానితో ఇప్పుడు ఈ సినిమాను అక్కడ ప్రీమియర్ వేయడానికి ప్లాన్ చేస్తునట్లు తెలిసింది. ఇప్పుడు ఈ సినిమాకు ప్రీ ప్రొడక్షన్ పనులు అన్నీ పూర్తి చేసుకొని షూటింగ్ మొదలుపెట్టడానికి సిద్దం అయ్యారు అని తెలుస్తుంది. ఈ ప్రభాస్ కొత్త ప్రేమ కథ వచ్చే ఏడాది విడుదల కావచ్చు.

,  ,  ,  ,  ,