Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

05-Oct-2017 15:46:21
facebook Twitter Googleplus
Photo

ప్రభాస్-అనుష్కలపై చాలానే రూమర్స్ ఉన్నాయి. బాహుబలి టైంలో ఇవి మరీ పీక్ స్టేజ్ కి వెళ్లిపోయాయి. ఏకంగా వీళ్లిద్దరూ పెళ్లికి రెడీ అయిపోయారనే వరకూ టాక్ వచ్చినా.. ఈమధ్యనే కాస్త ఇలాంటివి నెమ్మదించాయి. మళ్లీ ఇప్పుడు స్వీటీ అనుష్కతో బాహుబలి ప్రభాస్ పెళ్లి ఖాయమైందనే రూమర్స్ హల్ చల్ చేస్తున్నాయి.

ఈ డిసెంబర్ లోనే ఎంగేజ్మెంట్ అని.. ఇందుకు అనుష్క శెట్టి రెడీ అయిపోతోందని ఆ రూమర్స్ సారాంశం. వీటిపై ఇఫ్పటికే చాలాసార్లు క్లారిటీ ఇచ్చేందుకు ఈ ఆన్ స్క్రీన్ జంట ప్రయత్నించారు. మళ్లీ ఇప్పుడు రూమర్స్ మొదలవడంతో.. ఇప్పుడు ప్రభాస్ రియాక్ట్ కాక తప్పలేదు. 'అనుష్క నేను 9 సంవత్సరాల నుంచి సినిమా చేస్తున్నాం. అంటే అప్పటి నుంచి మా మధ్య బంధం ఉంది. అయితే.. అప్పటి నుంచి ఇప్పటి వరకూ మా మధ్య స్నేహం మాత్రమే ఉంది' అని ప్రభాస్ తేల్చి చెప్పాడు.

తమ మధ్య ఎలాంటి రూమర్స్ రాకుండా ఉండాలని ముందు నుంచి అనుకున్నామని.. కానీ ఒక జంట మళ్లీ మళ్లీ పెయిర్ గా నటించినపుడు.. ఇలాంటివి రావడం సహజమే అన్నాడు ప్రభాస్.

,  ,  ,  ,  ,