Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

30-Jun-2017 11:55:10
facebook Twitter Googleplus
Photo

ప్రభాస్ ఇప్పుడు దేశం మొత్తం మెచ్చేసిన బాహుబలి. వీరిద్దరి మధ్య ఎంతో స్నేహం ఉందనే విషయం చాలా కొద్ది మందికే తెలుసు. ప్రభాస్ ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుదేవాతో స్నేహం కొనసాగిస్తున్నాడు.

ప్రస్తుతం సాహో చిత్రాన్ని చేస్తున్నాడు యంగ్ రెబల్ స్టార్. దీని తర్వాత ప్రభాస్ హీరోగా తన దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నట్లు చెప్పాడు ప్రభుదేవా. ప్రభాస్ నా ఆప్త మిత్రుల్లో ఒకడు. గతంలో తను నా హిందీ సినిమా యాక్షన్ జాక్సన్ లో ఓ కేమియో కూడా చేశాడు. తనను డైరెక్ట్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. అలాగని తను బాహుబలి అనే కారణంతో ఈ సినిమా చేయాలని అనుకోవడం లేదు' అని చెప్పిన ప్రభుదేవా.. కేవలం వ్యాపార కోణంలోంచే ఈ సినిమా చేయాలని అనుకోవడం లేదని.. ప్రభాస్ తో సినిమా చేయాలన్న ఆలోచన తనకు ఎప్పటి నుంచో ఉందని అంటున్నాడు.

ప్రస్తుతం ప్రభాస్ సాహో చిత్రంతో బిజీగా ఉన్నాడు. అది పూర్తి కాగానే మా ఇద్దరి సినిమా మొదలుపెట్టే అవకాశాలున్నాయి' అని చెప్పిన ప్రభుదేవా.. సాహో దర్శకుడు సుజిత్ పై ప్రశంసలు కురిపించాడు. సుజిత్ ఇంకా చిన్న కుర్రాడు అయినా రన్ రాజా రన్ మూవీని ఎంతో ప్రతిభతో తెరకెక్కించాడని అన్నాడు డ్యాన్సింగ్ డాన్.

,  ,  ,  ,