Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

04-May-2017 11:39:51
facebook Twitter Googleplus
Photo

తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన టీవీ నటుడు ప్రదీప్ (29) అనుమానాస్పద మృతి విషయం ఇప్పుడు అనేక సందేహాల్ని వ్యక్తం చేసేలా మారింది. ఈ ఉదంతంలో వినిపిస్తున్న వాదనలు.. వస్తున్న సందేహాల మధ్య దూరం ఎక్కువగా ఉందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రదీప్ సూసైడ్ చేసుకున్నట్లుగా చెబుతున్నా.. ఇంట్లోని వాతావరణం.. అక్కడ కనిపిస్తున్న పరిణామాలు పలు సందేహాల్ని వ్యక్తం చేసేలా ఉన్నాయి. ఈ మొత్తం ఉదంతాన్ని 360 డిగ్రీస్ లో చూస్తే..

ఆత్మహత్య ఎందుకు కాదు?

= ఫ్యాన్కు ప్రదీప్ ఉరి వేసుకున్నట్లు చెబుతున్నా.. పోలీసులు వచ్చేసరికి నేల మీదమృతదేహం ఉండటం

= తల మీద గాయం ఉండటం

= రక్తం మరకల్ని తాను తుడిచినట్లుగా ప్రదీప్ సతీమణి పావనీరెడ్డి చెప్పటం

= పగిలిన గ్లాస్ అద్దాలు

= అద్దాలు ఎలా పగిలాయి? దానికి కారణం ఏమిటి?

= కోపంతో బెడ్రూంలోకి ప్రదీప్ వెళితే.. పావనీ వెనుక ఎందుకు వెళ్లలేదు?

= తలుపుల్ని బలవంతంగా ఎలా తెరిచారు? దానికి ఎవరైనా సాయం చేశారా?

= ఫ్యాన్ కు ప్రదీప్ ఉరి వేసుకున్నట్లు ఎవరూ చూడకపోవటం?

= మృతదేహాన్ని ఫ్యాన్ నుంచి ఎలా కిందకు దించారు?

పావనీ.. ప్రదీప్ లు ఎలా పెళ్లి చేసుకున్నారు?

టీవీ నటులైన ఇద్దరూ ప్రేమించుకున్నారు. జీవితంలో సెటిల్ అయ్యే వరకూ పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకొని సహజీవనం చేశారు. దీర్ఘరాలం రిలేషన్ షిప్ లో ఉండి.. గత ఏడాది ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు.

ఎవరీ శ్రవణ్? అతనిపైనే అనుమానాలు ఎందుకు?

పావనీ కజిన్ గా చెబుతున్నారు. ఖతార్ లో ఉండి.. సెలవులకు వచ్చి పోతుంటాడని చెబుతున్నారు. పావనీ ప్రొఫైల్ పిక్ లో శ్రవణ్ తో క్లోజ్ గా ఉన్న ఫోటోఉండటం పలు సందేహాలకు కారణమైంది. అయితే.. శ్రవణ్ తన బ్రదర్ అని పావనీ చెబుతోంది. ఎప్పుడూ నాలుగు రోజలు మాత్రమే ఉండే శ్రవణ్ ఈసారి ఎందుకు నెలల తరబడి ఉంటున్నాడన్నసందేహానికి.. అతను ఇస్తున్న సమాధానం వీసాలో నెలకొన్న చిక్కులతోనే ఉన్నట్లుగా చెబుతున్నాడు.

ఇంతకూ ఎవరీ శ్రవణ్?

వైజాగ్ కు చెందిన వాడు. పావనీ రెడ్డికి స్నేహితుడిగా చెబుతున్నారు. ప్రదీప్ మరణానికి కొన్ని గంటల ముందు సీరియల్ షూటింగ్ ముగించుకొని వచ్చి పార్టీలో భాగంగా మద్యం సేవించినట్లు చెబుతున్నారు. అర్థరాత్రి 12 గంటల వేళలో గెస్ట్ లు అంతా ఎవరికి ఇళ్లకు వారు వెళ్లిపోయారని.. .అప్పుడు ఇంట్లో పావనీ.. ప్రదీప్.. శ్రవణ్ లు మాత్రమే ఉన్నట్లుగా చెబుతున్నారు.

గొడవ జరిగిందా?

వ్యాట్సప్ లో తన డీపీగా శ్రవణ్ తో కలిసి ఉన్న ఫోటో పెట్టుకోవటంపై ప్రదీప్ సీరియస్ అయ్యారని.. అది గొడవగా మారిందన్నది ఒక వెర్షన్. ఈ సమయంలోనే ప్రదీప్.. శ్రవణ్ ల కు మధ్య ఘర్షణ చోటు చేసుకున్నట్లుగా చెబుతున్నారు. గొడవ జరిగిన తర్వాత అర్థరాత్రి వేళ ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ప్రదీప్ తర్వాత వచ్చాడని.. ఆ టైంలో తన గదిలో పావని తలుపు వేసుకొని ఉందని.. తాను బాత్రూంలో ఉన్నప్పుడు గడియ పెట్టుకోవటంతో అలా జరిగిందని.. దీనిపై ప్రదీప్ మందలించాడని.. ఈ సందర్బంగా చిన్న వాదులాట జరిగినట్లుగా పావనీ పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది.

సూసైడ్ జరిగిందని ఎలా గుర్తించారు?

ఇద్దరి మధ్య గొడవ అనంతరం.. తన బెడ్రూంలోకి వెళ్లిన ప్రదీప్ గడియపెట్టుకున్నాడని.. ఉదయం ఏడింటి ప్రాంతంలో తలుపు తట్టినా స్పందన లేకపోవటంతో బలవంతంగా తలుపు తెరిచినట్లుగా చెబుతున్నారు. ఫ్యాన్ కు చీరతో ఉరి వేసుకోవటంతో తాము కిందకు దించి 108కి ఫోన్ చేశామని చెబుతున్నారు.

ప్రదీప్ తల్లిదండ్రులు ఏమంటున్నారు?

తమ కొడుకు అనుమానాస్పద మృతి మీద తమకు ఎలాంటి అనుమానాలు లేవని ప్రదీప్ తల్లిదండ్రులు చెబుతున్నారు.

,  ,  ,  ,  ,