Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

16-Feb-2017 11:14:28
facebook Twitter Googleplus
Photo

తెలుగు సినిమాల్లో అమ్మ పాత్రల ట్రెండ్ ను మార్చేసిన నటి ప్రగతి. అమ్మ రోల్ అంటే డీగ్లామరస్ గా వైట్ హెయిర్ తో ఇలాగే ఉండాలని అనే సెంటిమెంట్ ను.. 2002లో వచ్చిన నువ్వు లేక నేను లేను మూవీలో హీరోయిన్ ఆర్తి అగర్వాల్ కి అమ్మగా మెప్పించింది ప్రగతి. అప్పుడు ఆమె వయసు జస్ట్ 24 ఏళ్లే కావడం అసలైన హైలైట్.

తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో.. తను బ్యూటిఫుల్ యంగ్ మదర్ గా మారిన రోజుల గురించి చెప్పింది ప్రగతి. 'ఓ సీరియల్ లో సీనియర్ నటి శ్రీవిద్య గారితో కలిసి నటిస్తున్నపుడు.. సురేష్ ప్రొడక్షన్స్ నుంచి ఫోన్ వచ్చింది. హీరోయిన్ కి అమ్మగా చేయాలని అడిగారు. నేనా అమ్మ పాత్రలోనా అని ఆశ్చర్యపోయాను. నాకు చేయడం కూడా ఇష్టం లేదు. అయితే.. శ్రీవిద్య గారు మాత్రం.. హీరోయిన్ అవుతావా.. కేరక్టర్ ఆర్టిస్ట్ అవుతావా తేల్చుకోమన్నారు. హీరోయిన్ కానపుడు ఏ పాత్ర అయినా ఒకటే. అమ్మ.. అక్క.. చెల్లి.. వదిన.. అమ్మమ్మ.. ఇలా ఏ రోల్ ని అయినా కేరక్టర్ ఆర్టిస్ట్ అనే అంటారు అని చెప్పి.. బలవంతంగా ఫోన్ చేయించారు' అని చెప్పింది ప్రగతి.

'15 ఏళ్ల క్రితం ఆమె బలవంతంగా ఫోన్ చేయించినా.. ఇప్పటికీ నేను అలాగే ఉన్నానంటే అందుకు కారణం.. శ్రీవిద్య గారు ఆరోజున నన్ను ఒప్పించడమే' అన్న ప్రగతికి.. ఇండస్ట్రీలో లక్కీ మస్కట్ అనే బిరుదు కూడా ఉంది. ఎవరైనా డెబ్యూ హీరో.. హీరోయిన్లకు ప్రగతి అమ్మగా నటిస్తే.. ఆ సినిమాతో పాటు ఆ యాక్టర్/యాక్ట్రెస్ లు కూడా స్టార్స్ అయిపోతారనే సెంటిమెంట్ ఉంది.

అల్లు అర్జున్ మొదటి సినిమా గంగోత్రిలో హీరోయిన్ కి అమ్మగాను.. చరణ్ మొదటి సినిమా చిరుతలో హీరో తల్లిగాను.. లావణ్య త్రిపాఠి మొదటి సినిమా అందాల రాక్షసి.. ఇలా చాలామంది యంగ్ హీరో.. హీరోయిన్లకు లాంఛింగ్ లోనే అమ్మగా చేశానని చెప్పింది టాలీవుడ్ యంగ్ అండ్ బ్యూటిఫుల్ మదర్ ప్రగతి.

,  ,  ,  ,  ,