Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

27-Feb-2017 10:52:11
facebook Twitter Googleplus
Photo

ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా స్వయంగా పింక్ సినిమా చూస్తున్నారంటే.. ఆ సినిమాను ప్రొడ్యూస్ చేసిన వారికీ.. డైరక్టర్ చేసినవారికీ.. అలాగే అందులో నటించిన నటీనటులకు కూడా చాలా ఆనందదాయకమైన విషయం. ఆ మెరుపును స్వయంగా రింగుల జుత్తు గంగ తాప్సీ పన్ను కళ్ళలో చూస్తే ఆ కిక్కు ఎలా ఉంటుంది?

అదిగో మీరే చూడండి. భారతదేశ రాజ్యాంగాధిపతి నిన్న స్వయంగా పింక్ సినిమాను చూసి.. మెగాస్టార్ అమితాబ్ బచ్చన్.. తాప్సీ.. మరియు ఇతర నటీనటలును అభినందించారు. ఆ సమయంలో ఒక డిఫరెంట్ చీర టైపు డ్రస్సింగులో అక్కడకు వచ్చిన తాప్సీ.. ఆ కళ్ళలో మెరుపులతోనే అందరినీ ఆకట్టుకుంది. నిజమైన ఆనందం ఎలా ఉంటుందో చూపించేసి అందరి మనస్సులూ దోచుకుంది.

ఇక తాప్సీ కళ్లలో మెరుపులు చూసిన ఆమె ఫ్యామిలీ.. అలాగే ఆమె స్నేహితులు అందరూ కూడా చాలా ఎక్సయిట్ అయిపోయారు. అందరూ ఆమెను ప్రశంసలతో ముంచెత్తారు.

,  ,  ,  ,  ,