Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

08-May-2016 12:57:41
facebook Twitter Googleplus
Photo

ప్రణీత సుభాష్.. టాలీవుడ్ లో ఈ అమ్మడు తక్కువ సినిమాల్లోనే కనిపించినా.. క్రేజ్ మాత్రం బాగానే సంపాదించింది. ఆ రేంజ్ కి తగ్గట్లుగా ఆఫర్స్ లేకపోయినా.. చేసిన సినిమాల వరకూ పెద్ద ప్రాజెక్టులు కావడం.. సంతోషించదగ్గ విషయం. ప్రస్తుతం మహేష్ బాబుతో ప్రణీత నటించిన బ్రహ్మోత్సవం ఈ నెల 20న విడుదలకు సిద్ధమవుతోంది.

ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్న ఈ మూవీలో.. ప్రణీత మెయిన్ హీరోయిన్ కాదనే విషయం ట్రైలర్ లోనే అర్ధమైపోయింది. పైగా మహేష్ తో ఒక్క డ్యూయట్ కూడా లేకపోవడం ఈ విషయాన్ని ఫైనల్ చేసేసింది. రెండు పాటల్లో కనిపించినా అవి గ్రూప్ సాంగ్స్ మాత్రమే. పోనీ దీన్ని సరిపెట్టుకుందామని అనుకున్నా.. అమ్మడిని ఓ హీరోయిన్ గా ఎవరూ కన్సిడర్ చేయని పరిస్థితి. ఆడియో ఫంక్షన్ లో కనీసం మహేష్ కూడా ప్రణీత పేరు ఎత్తలేదు.

గతంలో పవన్ కళ్యాణ్ తో అత్తారింటికి దారేది చిత్రంలో నటించిన ప్రణీతకు.. బాపుగారి బొమ్మో అంటూ ఓ డ్యూయట్ కూడా ఉంటుంది. స్క్రీన్ ప్రెజన్స్ కూడా సమంతతో సమానంగానే ఉంటుంది. అంతటి కేరక్టర్ ఉంటేనే.. అమ్మడికి అవకాశాలు అంతంతమాత్రంగా వచ్చాయి. మరి ఇప్పుడేమో మూడో హీరోయిన్ పైగా ఎవరూ పట్టించుకోని పరిస్థితి.. ఇలాంటి సిట్యుయేషన్ లో బ్రహ్మోత్సవం అమ్మడి కెరీర్ కి అంతగా యూజ్ కాకపోవచ్చనే అనిపిస్తోంది.

,  ,  ,  ,  ,  ,