Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

08-Oct-2016 10:38:50
facebook Twitter Googleplus
Photo

ప్రేమమ్ సినిమాలో హీరో అసలు ఆ హీరోయిన్ ను ఎందుకు ప్రేమిస్తాడో చెప్పడానికి.. ఒక నాటీ రీజన్ చెప్పారు. చూస్తుంటే అసలు అదే నాటీ రీజన్ నాగ చైతన్య రియల్ లైఫ్ లో కూడా కనక్ట్ అయిపోయింది. అందుకే ఈ సినిమాను చూసినవాళ్లందరూ ఆ సినిమాలో చైతూ చేసే బిజినెస్ పేరును చూసి.. ఎక్సయిట్ అవుతున్నారు.

తనకు చిన్నప్పుడు ఎవరో జ్యోతిష్యుడు కాబోయే భార్య పేరు 'ఎస్' అనే అక్షరంతో మొదలవుతుంది అని చెప్పాడని.. అందుకే 'ఎస్' అనే అక్షరంతో మొదలైన 'సుమ' అనే అమ్మాయికి లైన్ వేస్తున్నా అంటాడు హీరో చైతూ. ఆ తరువాత కూడా అతని జీవితంలోకి వచ్చిన మరో హీరోయిన్ పేరు 'సితార'. అయితే హీరో పెట్టే బిజినెస్ కూడా 'ఎస్' అంటూ టైటిల్ పెడతాడు. అది ఎవరిని ఉద్దేశించి పెట్టావ్ అని అతని మూడో లవర్ సింధు అడిగితే.. చిన్నప్పుడు జ్యోతిష్యుడు చెప్పాడు.. అందుకే పెట్టా అంటాడు.

ఇక సినిమాలో ఎస్ థియరీ అట్టా ఉంచితే.. నిజజీవితంలో కూడా ఇప్పుడు చైతన్యకు 'ఎస్' అనేది బాగానే వర్తించేసిందిగా. ఎస్ ఫర్ సమంత. అసలు సమంత కోసమే ప్రేమమ్ సినిమాలో ఈ 'S' థియరీ పెట్టించాడే అనే చిలిపి సందేహం వచ్చింది కదూ?

,  ,  ,  ,