Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

01-May-2017 10:32:59
facebook Twitter Googleplus
Photo

పెళ్లిచూపులు మూవీలో కమెడియన్ ప్రియదర్శి చేసిన కామెడీకి విపరీతమైన ప్రశంసలు వచ్చాయి. ఆ మూవీ ద్వారా మంచి పేరు సంపాదించుకున్న ప్రియదర్శి.. ఆ తర్వాత సినిమాల ఎంపికలో కేర్ ఫుల్ గా ఉన్నాడు. ప్రస్తుతం హంటర్ మూవీకి రీమేక్ గా బాబు బాగా బిజీలో నటించాడు ప్రియదర్శి.

పెళ్లి చూపులు తర్వాత ఏ సినిమా చేయాలని బాగా ఆలోచించాను. హంటర్ మూవీ రీమేక్ లో చేయమన్నపుడు.. పెద్దగా ఆలోచించలేదు. కానీ హంటర్ ఓ హానెస్ట్ మూవీ. అలాంటి ప్రయత్నం చేస్తారా.. అలాగే తీస్తారా అని దర్శకుడిని అడిగాను. కానీ నేను ఆశించిన స్థాయి కంటే బాగా తీశారు. ఈ సినిమా ద్వారా నాకు నచ్చిన మరో అద్భుత అవకాశం తనికెళ్ల భరణితో నటించడం. ఆయన్ను చూస్తూ పెరిగిన నాకు.. ఆయనతో కలిసి నటించడం.. ఆయన ఎదురుగుండా మాట్లాడే అవకాశం రావడం నా అదృష్టం అన్నాడు ప్రియదర్శి.

ఈ మూవీలో చేసిన ముగ్గురు అమ్మాయిల కేరక్టర్లు అద్భుతం. అలాంటి పాత్రలు సమాజంలో ఉంటాయి కానీ.. వాటిలో నటించేందుకు చాలా మంది ఒప్పుకోరు. కానీ వాళ్లు ధైర్యంగా చేసినందుకు హ్యాట్సాఫ్. ఈ చిత్రంలో తెలంగాణ యాసతో కాకుండా.. కేరక్టర్ కి తగినట్లుగా కావాలన్నారు.. అలాగే చేశాను.

,  ,  ,  ,  ,