Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

29-Jun-2016 11:53:08
facebook Twitter Googleplus
Photo

సూపర్ స్టార్ రజనీ కాంత్ నటించిన ?కబాలి? సినిమా ప్రస్తుతం సౌతిండియాలో హాట్ టాపిక్ అన్న విషయం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. జూలై నెలలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై అంచనాలన్నీ తారాస్థాయిలో ఉన్నాయి. ఇక గత రెండు రోజులుగా ఈ సినిమాకు సంబంధించి దేశవ్యాప్తంగా ఓ వివాదం జరుగుతోంది. బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ నటించిన ?మదారి? అనే సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను ?కబాలి? టీమ్ కాపీ కొట్టిందని, మదారిని పోలిన పోస్టర్‌నే కబాలి టీమ్ డిజైన్ చేసిందని వివాదం జరుగుతోంది.
ప్రముఖ జాతీయ వార్తా పత్రికలన్నీ ఈ అంశాన్ని ప్రస్తావనకు తెచ్చాయి. ఇక ఈ వివాదంపై నిర్మాత కళైపులి థాను కాస్త సీరియస్ అయ్యారు. ?కబాలి?కి సంబంధించి ఏ పోస్టర్ విషయమై చర్చ జరుగుతుందో, అది అభిమానులు తయారుచేసిన పోస్టర్ అని, దాన్ని పట్టుకొని నిజాలు తెలుసుకోకుండా వివాదం రేపడం మంచిది కాదని అన్నారు. పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూలై 22న ప్రేక్షకుల ముందుకు రానుంది

,  ,  ,  ,  ,  ,  ,