Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

18-Sep-2017 15:49:09
facebook Twitter Googleplus
Photo

జయాపజయాలతో సంబంధం లేకుండా స్టార్ డమ్ ని సంపాదించుకున్న ఒకే ఒక్కడు పవన్ కళ్యాణ్ అని చెప్పాలి. సాధారణంగా ఎవరికైనా విజయాలు వస్తే స్టార్ హోదా పెరుగుతుంది. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఎన్ని అపజయాలు వచ్చినా ప్రతి సినిమాకి అభిమానులు పెంచుకుంటూ వస్తూనే ఉన్నాడు. అలాగే ఒకే ఒక్క సినిమాతో ఎవ్వరికి అందని బాక్స్ ఆఫీస్ హిట్ కొట్టగలిగే సత్తా పవన్ లో ఉందని చెప్పవచ్చు.

అయితే త్వరలో తన 25వ సినిమాతో టాలీవుడ్ చరిత్రలో బాక్స్ ఆఫీస్ సునామి సృష్టించడానికి రెడీ అవుతున్నాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్న చిత్రంతో ప్రస్తుతం పవన్ చాలా బిజీగా ఉన్నాడు. ఆ సినిమాలో పవన్ ఒక ఐటి ఉద్యోగిగా కనిపించబోతున్నాడు. అలాగే సినిమాకు "అజ్ఞాతవాసి" అనే టైటిల్ కూడా త్రివిక్రమ్ ఫిక్స్ చేసినట్లు వార్తలు బాగా వినిపిస్తున్నాయి. మొన్నటివరకు బ్యాంకాక్ లో పోరాట సన్నివేశాలు జరిపాడు పవన్. అయితే ఈ నెల 20 నుంచి హైదరాబాద్ లో మరో షెడ్యూల్ తో చెకా చెకా సినిమాను పూర్తిచేస్తాడట.

ఈ షెడ్యూల్లో లో సన్నివేశాలు సినిమాలో చాలా కీలకం అని తెలుస్తోంది. పవన్ పాత్ర కూడా చాలా కొత్తగా ఉంటుందట. అయితే ఆ సన్నివేశాల చిత్రీకరణ తర్వాత వెంటనే పవన్ మళ్లీ చిత్ర యూనిట్ తో కలిసి విదేశాలకు వెళ్లనున్నాడు. మొత్తంగా డిసెంబర్ లోపు షూటింగ్ తో పాటు డబ్బింగ్ ని కూడా పూర్తి చేసి జనవరి 10న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి త్రివిక్రమ్-పవన్ చాలా స్పీడ్ గా వర్క్ చేస్తున్నారు.

,  ,  ,  ,