Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

21-Nov-2017 14:14:22
facebook Twitter Googleplus
Photo

పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి పూర్తిగా అడుగుపెట్టేముందు ముందు తీస్తున్న తన 25వ చిత్రంపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు ఇంకా టైటిల్ ను ఖరారు చేయలేదు. కానీ గత కొన్ని నెలలుగా అజ్ఞాతవాసి అనే పేరు మాత్రం బాగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తో ఉండే ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం తుది దశలో ఉంది.

అయితే సినిమాపై ఎన్ని అంచనాలు ఉన్నా ఇప్పుడు ఓ వర్గం మెగా అభిమానుల్లో ఒక అనుమానం కొంచెం కన్ఫ్యూజన్ కి గురి చేస్తోంది. అదేంటి అంటే.. పవన్ కళ్యాణ్ సినీ కెరీర్ లో ఎన్నో అపజయాలను చూశాడు. అయినా ఆయన క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు అది వేరే విషయం. అయితే సినిమా షూటింగ్ ఫైనల్ షెడ్యూల్ ని వారణాసి లో ప్లాన్ చేశారు. అదొక్క షెడ్యూల్ ఆయిపోతే సినిమా షూటింగ్ అయిపోతుంది.

కానీ అనుమానం కలిగించే బ్యాడ్ న్యూస్ ఏమిటంటే ఇంతకుముందు పవన్ కళ్యాణ్ తీన్ మార్ సినిమా వారణాసి బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమాకు త్రివిక్రమ్ మాటలను అందించగా జయంత్ సి పరాన్జీ దర్శకత్వం వహించారు. కానీ సినిమా మాత్రం డిజాస్టర్ అయ్యింది.

,  ,  ,  ,  ,  ,  ,