Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

25-Aug-2015 15:12:19
facebook Twitter Googleplus
Photo

తమిళ స్టార్ హీరో విజయ్ మూవీ రిలీజ్ కి రెడీ అయింది. సోషియో ఫాంటసీ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ మూవీపై తమిళ ఇండస్ట్రీలో బోలెడు అంచనాలున్నాయి. కోలీవుడ్ లోనే అత్యంత ఎక్కువ బడ్జెట్ తో రూపొందిన పులిలో... శృతిహాసన్ హన్సిక లాంటి బ్యూటీలతోపాటు అలనాటి అందాల తార శ్రీదేవి కూడా కీలకపాత్ర పోషించింది. తమిళ ఇండస్ట్రీకి బాహుబలి లాంటిదంటూ ప్రచారం జరుగుతోంది. పులి చిత్రాన్ని తెలుగులోనూ భారీగా రిలిజ్ చేయబోతున్నారు. అక్టోబర్ 1న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించింది పులి యూనిట్.

ప్రస్తుతం పులి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ సూపర్బ్ గా ఉందని టాక్. అయితే... పులి రిలీజ్ చేయబోతున్న డేట్ అక్టోబర్ 1. ఆ మరుసటి రోజే తెలుగులో చాలా మూవీలను రిలీజ్ చేసేందుకు షెడ్యూల్ చేశారు. క్రిష్ డైరెక్షన్ మెగా వారసుడు వరుణ్ తేజ్ నటించిన కంచె.. అనుష్క రెండు విభిన్న గెటప్స్ లో కనిపించనున్న సైజ్ జీరో.. రామ్ నటిస్తున్న శివం.. వంటి తెలుగు సినిమాలు అక్టోబర్ 2న రిలీజ్ అవుతున్నాయ్. వీటన్నిటి మీదా హై ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి.

టాలీవుడ్ ఇప్పుడు సోలో రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. అయితే.. ఇవన్నీ మీడియం బడ్జెట్ సినిమాలే కావడంతో... ఇన్నేసి మూవీలను రిలీజ్ కి రెడీ చేశారు. ఇప్పుడు పులి లాంటి భారీ చిత్రం కూడా సేమ్ డేట్ కి రిలీజ్ కానుండడంతో... టెన్షన్ మొదలైంది. ఇది నిలబడాలంటే... భారీగా స్క్రీన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ విజయ్ కు తుపాకి తప్ప తెలుగులో అంత మార్కెట్ లేదు. సో... ఈ మూడు తెలుగు సినిమాల రిలీజ్ నాటికి రావడం.. పులికి కాస్త ఇబ్బందికర విషయమే..

,  ,  ,  ,  ,  ,  ,