Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

11-Jun-2015 12:48:47
facebook Twitter Googleplus
Photo

చిరంజీవి 150వ సినిమా షూటింగ్ ప్రారంభం నాటికి నితిన్ తో పూరీ జగన్నాథ్ ఒక సినిమాను పూర్తి చేయనున్నట్టు ఈ మధ్య వార్తలు షికారు చేశాయి. ఈ నెల 15 నుంచి ఈ సినిమా షూటింగ్ ఆరంభం కానున్నట్టు ఈ ఇద్దరూ కూడా అభిమానులకి చెప్పారు. అయితే ఏవైందో తెలియదుగానీ, ఇప్పుడీ సినిమాలో నితిన్ నటించడం లేదని తెలుస్తోంది. పూరీ తో చేయాలనుకున్న సినిమా అనివార్య కారణాల వలన ఆగిపోయిందనీ, త్వరలోనే ఆయనతో కలిసి పనిచేసే అవకాశం లభించాలని కోరుకుంటున్నానని నితిన్ ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు.

ఇక పూరీ కూడా ఈ విషయంలో అభిమానులకి స్పష్టత ఇచ్చాడు. నితిన్ కి బదులుగా మరో హీరోతో ముందుగా చెప్పిన రోజునే ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందని చెప్పాడు. నితిన్ బదులుగా ఈ సినిమాలో చేసే హీరో వరుణ్ తేజ్ కావొచ్చనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. ఎందుకంటే నితిన్ కంటే ముందు వరుణ్ తేజ్ పేరే వినిపించింది. ఆ తరువాత నితిన్ రావడం ... మళ్లీ పక్కకి తప్పుకోవడం జరిగిపోయాయి. అలా ఎందుకు జరిగిందనేదే ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది.

,  ,  ,  ,  ,