Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

18-Apr-2016 11:12:12
facebook Twitter Googleplus
Photo

పూరి జగన్నాథ్ సినిమాల్లో ప్రశ్నలకు కొదవే ఉండదు. సూటిగా సుత్తి లేకుండా ప్రశ్నలు సంధిస్తుంటాడు పూరి. లా పాయింట్లు తీయడం ఆయనకు ముందు నుంచి అలవాటు. సినిమాల్లో అలాంటి డైలాగులు రాసేవాడు.. నిజ జీవితంలో మాత్రం ఎలా సైలెంటుగా ఉంటాడు. డిస్ట్రిబ్యూటర్లతో తన గొడవకు సంబంధించిన వ్యవహారంలో కూడా పూరి లాజిక్ ప్రకారమే మాట్లాడుతున్నాడు. ?లోఫర్? డిస్ట్రిబ్యూటర్లు తన ఇంటి మీదికి దాడికి దిగినట్లు.. తాను వాళ్ల మీద కేసులు పెట్టినట్లు వస్తున్న వార్తలు వాస్తవమే అని ధ్రువీకరిస్తూ.. తనను కాంపెన్సేషన్ అడుగుతున్న వారికి సూటిగా కొన్ని ప్రశ్నలు సంధించాడు పూరి.

??డిస్ట్రిబ్యూటర్లు.. వారి నష్టాలకు సంబంధించిన వార్తలతో ఏకీభవిస్తున్నా. ఐతే ఏ డిస్ట్రిబ్యూటర్ అయినా.. ఓ సినిమా లాభాల్ని పంచుకోవడానికి సిద్ధపడినపుడు.. నష్టాలకు కూడా సిద్ధంగా ఉండాలి కదా. తమ నష్టాల్ని దర్శకుడు లేదా హీరో భరించాలి అని అడిగే సంస్కృతి సరైంది కాదు. డిస్ట్రిబ్యూటర్లకు ఎవరైనా పరిహారం చెల్లించాలని అనుకుంటే మంచిదే. అది వాళ్లిష్టం?? అని పూరి అభిప్రాయపడ్డాడు. పెద్ద సినిమాలు నష్టపోయినపుడు తమకు పరిహారం చెల్లించాలని డిస్ట్రిబ్యూటర్లు గొడవ చేసే కల్చర్ కోలీవుడ్ నుంచి వచ్చింది. ముఖ్యంగా సూపర్ స్టార్ రజినీకాంత్ ఇలాంటి తలనొప్పులు చాలా ఎదుర్కొన్నారు. చాలాసార్లు ఆయన డిస్ట్రిబ్యూటర్లను ఆదుకునే ప్రయత్నం చేశారు. ఐతే కమల్ హాసన్ మాత్రం ఈ పద్ధతిని తీవ్రంగా వ్యతిరేకించారు. పూరి తరహాలోనే ఆయన ప్రశ్నలు సంధించారు. లాభాలొస్తే తిరిగి ఇవ్వని డిస్ట్రిబ్యూటర్లు.. నష్టాలకు మాత్రం పరిహారం ఎలా అడుగుతారని ఆయన గట్టిగా ప్రశ్నించారు.

,  ,  ,  ,