Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

24-Oct-2016 11:55:12
facebook Twitter Googleplus
Photo

బాహుబలి సినిమాలో ఒక చోట రాజమౌళి కూడా కనిపిస్తాడన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరో ప్రభాస్ కనిపించినపుడు థియేటర్లలో ఎంత రెస్పాన్స్ కనిపిస్తుందో జక్కన్న కనిపించినపుడూ అంతే హంగామా ఉంటుంది. ?బాహుబలి: ది బిగినింగ్?కు రాజమౌళి క్యామియో కూడా ఒక ఆకర్షణగా నిలిచింది. ఐతే రాజమౌళి మాత్రం తాను అందులో క్యామియో చేయడం తప్పిదం అంటున్నాడు. అలాంటి తప్పిదాలు రిపీట్ చేయను అని చెప్పాడు. ?ది బిగినింగ్?లో మాదిరే.. ?ది కంక్లూజన్?లోనూ అతిథి పాత్ర చేస్తారా అని అడిగితే.. ??అది నేను చేసిన మిస్టేక్. నేను ఒక మిస్టేక్ చేశాక దాన్ని రిపీట్ చేయాలనుకోను. కాబట్టి రెండో భాగంలో నేను కనిపించను?? అని నవ్వేశాడు రాజమౌళి.

ఇక మహాభారతం తెరకెక్కించడం.. బాలీవుడ్లో నేరుగా సినిమాలు చేయడం గురించి రాజమౌళి స్పందిస్తూ.. ??నేను ఇంతకుముందే చెప్పాను. ?మహాభారతం? చేయడానికి నాకు ఇంకో పదేళ్లు అనుభవం కావాలని. కాబట్టి అందుకు ఇంకా సమయం ఉంది. నేరుగా బాలీవుడ్ సినిమాలు చేసే అవకాశముంది. ఏదైనా కథకు అనుగుణంగానే ఉంటుంది. ప్రాంతీయ సినిమాలు లాంగ్వేజ్ బారియర్స్ దాటుకుని అందరికీ చేరడం అన్నది అన్నిసార్లూ జరగదు. ?బాహుబలి?లో అందరికీ చేరువయ్యే యూనివర్శల్ అంశాలున్నాయి కాబట్టే అంతగా జనాలకు రీచ్ అయింది. ?బాహుబలి? విషయంలో ఇలా జరిగిందంటే అది బాహుబలి గొప్పదనం తప్ప.. రాజమౌళి గొప్పదనం కాదు. అన్ని కథలూ ఇలా మ్యాజిక్ చేయలేవు?? అని రాజమౌళి అభిప్రాయపడ్డాడు.

,  ,  ,  ,