Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

27-Jun-2017 13:46:03
facebook Twitter Googleplus
Photo

అవును.. ఎప్పటినుండో మహేష్ బాబు అండ్ రాజమౌళి కలసి ఒక సినిమాలో పనిచేయాలి. నిర్మాత ఆదినారాయణకు ఆల్రెడీ కమిట్మెంట్ ఇచ్చినట్లు గతంలో అటు మహేష్ ఇటు రాజమౌళి తెలిపారు. అయితే ఈ సినిమా చేస్తే మాత్రం.. రాజమౌళి ఒక విషయంలో మహేష్ బాబుకు అవకాశం ఇచ్చినట్లే అంటున్నారు సినిమా లవ్వర్స్. ఏంటా విషయం? పదండి చూద్దాం.

నిజానికి బాహుబలి సినిమా 1వ భాగం వచ్చినప్పుడు.. తొలిరోజున 22+ కోట్ల షేర్ అంటే కాస్త పెద్ద విషయమే అనుకున్నారు కాని.. ఆ తరువాత మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెం 150తో దానిని బీట్ చేసి.. 23+ కోట్లు షేర్ తెచ్చారు. కంటెంట్ సింపుల్ గా ఉన్నా కూడా ఒక స్టార్ విలువ అది. ఆ తరువాత పవన్ కాటమరాయుడు ఫ్లాప్ టాకుతో 22+ కోట్లు కొట్టేసింది. హిట్ టాక్ తో జనతా గ్యారేజ్ 20+ కోట్లు తెచ్చింది. ఇదంతా చూస్తుంటే.. ఒకవేళ రాజమౌళి అండ్ మహేష్ కలసి సినిమా చేస్తే సీన్ ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఆల్రెడీ రాజమౌళి మీద ఉన్న నమ్మకం.. మహేష్ స్టార్ వాల్యూ కలిస్తే.. ఏమో ఎవరికి తెలుసు బాహుబలి 2 తెచ్చిన 42+ కోట్ల డే వన్ షేరును కొట్టేస్తారేమో. మరో ప్రక్కన అలా చేస్తే.. రాజమౌళి రికార్డును బీట్ చేయడానికి స్వయంగా రాజమౌళే మహేష్ ను రంగంలోకి దించినట్లు.

ప్రస్తుతం డివివి దానయ్య ప్రొడక్షన్లో ఒక సినిమాకు కమిట్ అయిన రాజమౌళి.. ఆ సినిమా పూర్తవ్వగానే ఈసారి ఖచ్చితంగా మహేష్ తో సినిమా చేస్తానని అంటున్నాడట. అలాగే మహేష్ కూడా కొరటాల శివ అండ్ వంశీ పైడిపల్లి సినిమాలు పూర్తవ్వగానే రాజమౌళితో చేసేయాలని చూస్తున్నాడట.

,  ,  ,  ,