Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

07-Jun-2016 11:56:13
facebook Twitter Googleplus
Photo

హీరోయిన్ ప్రియాంక చోప్రా.. డైరెక్టర్ రాజమౌళితో ఎలా పోటీ పడుతుందనే సందేహం కరెక్టే కానీ.. వీళ్లిద్దరికీ కొన్ని పోలికలు ఉన్నాయి. బాలీవుడ్ హీరోయిన్ స్థాయి నుంచి హాలీవుడ్ ని దున్నేసేందుకు వెళ్లిపోయింది పీసీ. టాలీవుడ్ లో తిరుగులేని సక్సెస్ లు సాధించే దర్శకుడిగా పేరుపొందిన రాజమౌళి.. బాహుబలితో ఇంటర్నేషనల్ స్థాయి దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇలా ఇద్దరూ సినిమా రంగానికి చెందిన వారే.. స్థానికంగానే కాకుండా అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్నవారే.

కానీ వీరిద్దరి మధ్యా పోటీ ఈ విషయంలో కాదు. ప్రస్తుతం ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు నామినీలను అనౌన్స్ చేసింది సీఎన్ ఎన్ న్యూస్ 18 గ్రూప్. ఈ జాబితాలో రాజమౌళి - ప్రియాంక చోప్రా - రణ్ వీర్ సింగ్ - సంజయ్ లీలా భన్సాలీలు ఉన్నారు. రాజమౌళి తప్ప మిగిలినవారంతా బాలీవుడ్ స్టార్లు - దిగ్గజాలే. ఇప్పటికి నామినేషన్స్ మాత్రమే అయినా.. ఓటింగ్ - సెలక్షన్ అయి.. ఆ తర్వాత విన్నర్స్ ని అనౌన్స్ చేయడానికి మరికొన్ని నెలల సమయం పడుతుంది.

ఇప్పటికే ఎన్నో దేశ - విదేశీ అవార్డులను ఖాతాలో వేసుకున్న రాజమౌళికి.. ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా దక్కాలని టాలీవుడ్ జనాలు కోరుకుంటున్నారు. జక్కన్నకు ప్రధాన పోటీ మాత్రం ప్రియాంక చోప్రా నుంచే అనే టాక్ వినిపిస్తోంది.

,  ,  ,  ,  ,  ,  ,