Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

28-Sep-2016 12:05:27
facebook Twitter Googleplus
Photo

స్టూడెంట్ నం.1... జూనియర్ ఎన్టీఆర్ కు తొలి హిట్ వచ్చిన చిత్రం. నిజానికి అంతకుముందే ఓ చిత్రం ద్వారా హీరోగా పరిచయం అయినా పెద్దగా గుర్తింపు రాలేదు. స్టూడెంట్ నం.1తోనే దర్శకుడిగా ఎస్.ఎస్. రాజమౌళి పరిచయం అయింది. ఆ సినిమా విడుదలై 15 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నాటి రోజుల్ని గుర్తు చేసుకుంటే ట్వీట్స్ పెట్టారు దర్శకుడు రాజమౌళి.

?దర్శకుడిగా పరిచయమై 15 సంవత్సరాలు పూర్తయ్యాయి. కానీ ఎడిటింగ్ అసిస్టెంట్ గా కెరీర్ ప్రారంభించి పాతికేళ్లయింది. తల్చుకుంటూ ఉంటే చాలా వింతగా ఉంది. కానీ ఇన్ని రోజులు ఎలా గడిచిపోయాయి అనిపిస్తోంది? అంటూ రాజమౌళి ట్వీట్ పెట్టారు. ఆ తరువాత స్టూడెంట్ నం.1 షూటింగ్ రోజుల్లో తారక్ తో చోటు చేసుకున్న కొన్ని సంఘటనలను పంచుకున్నారు. స్విట్జర్లాండ్ లో షూటింగ్ జరుగుతున్నప్పుడు తారక్ తాను ఒకే గదిలో ఉన్నామని చెప్పారు. తనకి రాత్రి 9 గంటలకే నిద్రపోవడం అలవాటనీ కానీ తారక్ మాత్రం అర్ధరాత్రి 12 వరకూ టీవీ చూస్తుండేవాడనీ చెప్పారు. ఇంతకీ తారక్ ఏం చూసేవాడంటే.. వ్యవసాయానికి సంబంధించిన కార్యక్రమాలట!

ఇప్పుడు స్టూడెంట్ నం.1 సినిమాలోని ఇంట్రెవెల్ సీక్వెన్స్ చేస్తుంటే ఇంకాస్త మెచ్యూర్డ్ గా తీసి ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఈ సినిమా విజయం క్రెడిట్ సంగీత దర్శకుడు కీరవాణి రచయిత పృథ్వితేజలకు దక్కుతుందని రాజమౌళి చెప్పారు. ఆ సినిమా విజయయాత్రకు వెళ్లడం ఎప్పటికీ మరచిపోలని అనుభూతి అన్నారు. 19 సంవత్సరాల తారక్ ను చేసేందుకు ఎనభయ్యేళ్ల ముసలాళ్లు కదలి వస్తుంటే చాలాబాగా అనిపించిందని రాజమౌళి చెప్పారు.

,  ,  ,  ,  ,