Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

29-May-2017 11:07:55
facebook Twitter Googleplus
Photo

బాహుబలి పార్ట్ 2 సాధించిన అమోఘమైన విజయానికి.. మొత్తం దేశీయ చలన చిత్ర అబ్బురపడింది. ఆడియన్స్ బాహుబలి2కి సాహో అంటే.. ఇండస్ట్రీ అంతా రాజమౌళికి సాహో అనేశారు. అయితే.. ఎంతబాగా తీశామని నమ్మకం ఉన్నా.. ఫిలిం మేకర్ కి థియేటర్ లో ఆడియన్స్ నుంచి రియాక్షన్ వచ్చే వరకూ టెన్షన్ తప్పదు. బాహుబలి మొదటి భాగం రిలీజ్ తర్వాత వచ్చిన రియాక్షన్ కి ఓ రోజంతా రూమ్ లోనే ఉండిపోయానని ప్రభాస్ చెప్పిన విషయం గుర్తుండే ఉంటుంది.

బాహుబలి2 విషయంలో విజయంపై నమ్మకం ఉన్నా టెన్షన్ మాత్రం తప్పలేదన్నాడు జక్కన్న. తాము ఓ 40మంది టీం కలిసి ముంబైలో గ్రాండ్ ఈవెంట్ కోసం వెళ్లగా.. వినోద్ ఖన్నా మరణించడంతో అది రద్దయిందని చెప్పిన రాజమౌళి.. అక్కడ ఓ మల్టీప్లెక్స్ లో మూవీ చూసేందుకు తమ టీం వెళ్లామన్నారు. అయితే.. మూడు రాత్రులుగా సరిగా నిద్రలేకపోవడంతో తమ టీంలో చాలామంది నిద్రపోయారని.. చుట్టూ జనాల నుంచి కూడా రియాక్షన్ లేకపోవడంతో ఎక్కడ తప్పు చేశాననే విషయం అర్ధం కాలేదన్నాడు జక్కన్న.

మేం చూసిన మల్టీప్లెక్స్ లో సౌండ్ తక్కువగా ఉంది. పక్కనే ఇంకో స్క్రీన్ కి వెళ్లాం. మా ప్రొడ్యూసర్ సోదరుడు వెంకట్.. నా చేతులు పట్టుకుంటే.. ఆయన చేతులు వణుకుతున్నాయి. మొదటగా అప్పుడు కొంత రిలీఫ్ వచ్చింది. ఆ తర్వాత కరణ్ జోహార్ ఆఫీస్ కి వెళ్లాం. అక్కడ అందరూ పొగిడారు కానీ.. బాలీవుడ్ లో కాస్త ఎక్కువ పొగుడుతారు. అందుకే అది కూడా నమ్మలేకపోయాను. ఆ సమయంలో మా కజిన్ భార్య సీత నుంచి టెక్ట్స్ మెసేజ్ వచ్చింది. సినిమా సూపర్ అంటూ థంబ్స్ అప్ సింబల్ పంపారు. తనది చాలా మాస్ టేస్ట్. దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి భార్య ఆమె. భర్త క్లాస్ సినిమాలు తీస్తే.. ఆమెకు మాత్రం విపరీతమైన మాస్ టేస్ట్.

,  ,  ,  ,