Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

07-May-2015 11:53:05
facebook Twitter Googleplus
Photo

రజనీకాంత్ తదుపరి సినిమాపై గత కొంతకాలంగా నెలకొన్న సస్పెన్స్ కి తెరపడింది. 'లింగా' తర్వాత ఆయన నటించే సినిమా ఖరారైంది. పెద్ద డైరెక్టర్లతో ఆయన సినిమా ఉంటుందంటూ వచ్చిన వార్తలకు పుల్ స్టాప్ పెడుతూ, ఓ యువ దర్శకుడితో ఆయన సినిమా కన్ఫర్మ్ అయింది. 'అట్టకత్తి', 'మద్రాస్' వంటి సినిమాలతో పేరుతెచ్చుకున్న రంజిత్ దర్శకత్వంలో తన తదుపరి సినిమా చేయడానికి రజనీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. దీనిని ప్రముఖ నిర్మాత కలైపులి థాను నిర్మిస్తారు. ఈ విషయాన్ని నిర్మాత అధికారికంగా ధ్రువీకరిస్తూ ప్రకటన విడుదల చేశారు. దీనిని తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో నిర్మిస్తామని నిర్మాత చెప్పారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, త్వరలోనే షూటింగ్ మొదలుపెడతామని ఆయన తెలిపారు.

,  ,  ,  ,  ,