Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-Jun-2015 11:15:35
facebook Twitter Googleplus
Photo

చిత్రపరిశ్రమలో కొంతమందిని అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది .. మరికొందరితో అది దోబూచులాడుతుంది. అలా ఎంతోకాలంగా దోబూచులాడుతూ వున్న అదృష్టం ఒక్కసారిగా ఎదురుగా వచ్చి పలకరిస్తే ఎలా వుంటుందో, నిర్మాత 'కలైపులి థాను' పరిస్థితి కూడా ఇప్పుడు అలాగే వుంది. యువ దర్శకుడు రంజిత్ తో రజనీకాంత్ చేస్తోన్న సినిమాను నిర్మిస్తున్నది ఆయనే. కలైపులి థాను .. రజనీకాంత్ కి వీరాభిమాని. 40యేళ్ల క్రితం థాను డిస్ట్రిబ్యూటర్ రంగంలోకి అడుగుపెట్టినప్పుడు, రజని నటించిన 'భైరవి' సినిమాను రాష్ట్ర వ్యాప్తంగా విడుదల చేశాడు.

ఆ సమయంలోనే ఆయన రజనీకాంత్ పేరుకి ముందు 'సూపర్ స్టార్' బిరుదును చేర్చి ప్రచారం చేశాడు. ఆ తరువాత కొంతకాలానికి నిర్మాతగా మారిన ఆయన రజనీతో కొన్ని సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తూ వచ్చినా, ఏదో ఒక కారణంగా అవి విఫలమవుతూ వచ్చాయి. ఆయన రజనీని సూపర్ స్టార్ గా ప్రచారం చేసిన ఇన్నేళ్లకి ఆయనతో సినిమా చేసే అవకాశం కలైపులి థానుకి లభించింది. ఆనందబాష్పాలు వర్షిస్తూ వుండగా ఆయన ఈ విషయాన్ని వివరించడం విశేషం.

,  ,  ,  ,  ,  ,