Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

19-Apr-2016 12:34:52
facebook Twitter Googleplus
Photo

టాలీవుడ్ యంగ్ హీరోయిన్స్ లో మోస్ట్ లక్కీ ఎవరంటే.. రకుల్ ప్రీత్ సింగ్ అనే చెప్పాలి. ఇప్పటివరకూ కెరీర్ లో ఒక్క బ్లాక్ బస్టర్ కూడా లేకపోయినా.. వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేసేస్తున్న ఏకైక హీరోయిన్ రకుల్.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో కలిసి ఈ కుర్ర భామ నటించిన సరైనోడు మరో మూడ్రోజుల్లో విడుదల కానుంది. ఈ మూవీతో అయినా తన ఖాతాలో బన్నీ ఓ బ్లాక్ బస్టర్ వేస్తాడని బోలెడన్ని ఆశలు పెట్టుకుంది రకుల్ ప్రీత్. కిక్ 2 దగ్గర నుంచి ఈమెకు బడా హీరోలతో మూవీస్ మొదలయ్యాయి. మొదట మాస్ మహరాజ్ రవితేజతో చేసిన కిక్ 2 ఫ్లాప్ అయింది. తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో చేసిన బ్రూస్ లీ అయితే అడ్రస్ గల్లంతయింది.

తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి నటించిన నాన్నకు ప్రేమతో హిట్ అనిపించుకున్నా.. బ్లాక్ బస్టర్ కోటాలోకి మాత్రం చేరలేదు. దీంతో ఇప్పుడు ఆశలన్నీ బన్నీపై పెట్టేసుకుంది రకుల్ ప్రీత్ సింగ్. దీనికి తగ్గట్లుగానే ఇండస్ట్రీలో సరైనోడుపై చాలానే అంచనాలు ఉన్నాయి. బోయపాటి మార్క్ యాక్షన్ మార్క్ సినిమాగా వస్తున్న సరైనోడు కోసం మెగాభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

,  ,  ,  ,  ,  ,