Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

13-Apr-2017 11:00:36
facebook Twitter Googleplus
Photo

టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ రీసెంట్ గా ఓ స్టేట్మెంట్ ఇచ్చింది. ఇప్పటివరకూ తనకు మంచి పాత్రలు వచ్చినా.. మెయిన్ స్టోరీలో కాకుండా సబ్ ప్లాట్స్ లో మాత్రమే తన పాత్ర ఉండేదని చెప్పింది. నాగచైతన్యతో చేస్తున్న రా రండోయ్ వేడుక చూద్దాం మూవీలో మాత్రం హీరోతో సమానమైన.. మెయిన్ స్టోరీలో రోల్ దక్కిందన్నది ఈమె కామెంట్.

బాగానే ఉంది కానీ.. ఇలాంటి కామెంట్స్ ఇప్పుడే ఎందుకు చేయడం అన్నది ఈమెకు అవకాశాలు ఇచ్చిన స్టార్ హీరోల ఫ్యాన్స్ వాదన. ధృవ మూవీలో అయినా.. నాన్నకు ప్రేమతో చిత్రంలో అయినా.. రకుల్ రోల్ మెయిన్ స్టోరీలోనే అయ్యే ఉంటుంది. అది కాకుండా ఆమెకు అసంతృప్తిగా ఉంటే.. చేయడం మానేయచ్చు కదా. కానీ అప్పుడు అవకాశాలు.. స్టార్ హీరోలు చాలా ముఖ్యం. ఎందుకంటే పేరు సంపాదించుకోవడం మాత్రమే అప్పుడు టార్గెట్ అవుతుంది. కొంత ఖ్యాతి వచ్చాక.. అంటే స్టార్ అనే గుర్తింపు వచ్చిన తర్వాత మాత్రం.. ప్రాధాన్యతలు.. యాక్టింగ్ ట్యాలెంట్ లు.. స్టోరీలు.. సబ్ ప్లాట్స్ గుర్తుకు రావడంలో ఆశ్చర్యమేమీ లేదు.

రకుల్ మాత్రమే కాదు.. ఇలాంటి కామెంట్స్ గతంలో కూడా కొందరు స్టార్ హీరోయిన్స్ చేశారు. అందరూ స్టార్స్ అయ్యాకే నోరు విప్పుతారు. ఎందుకంటే ముందే మాట్లాడితే.. అవకాశాలు రావనే భయం. అందుకే సేఫ్ గేమ్ ఆడేస్తారన్న మాట. ఇప్పుడు రకుల్ నోటికి పని చెబుతున్న సమయం కూడా ఇదే.

అది సరే కానీ రకుల్ బేబీ.. హీరోయిన్లు వాళ్ల కెరీర్ పై వాళ్లు సేఫ్ గేమ్ ఆడినపుడు.. కోట్లు పోసి సినిమాలు తీసీ ప్రొడ్యూసర్లు.. హీరోను బేస్ చేసుకుని సినిమా తీయాలని వాళ్ల జాగ్రత్త వాళ్లు తీసుకుంటే తప్పేంటో అర్ధం కాని విషయం కదా

,  ,  ,  ,