Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

19-Dec-2017 13:01:51
facebook Twitter Googleplus
Photo

ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా ప్రతి హీరోయిన్ మదిలో మెదిలో ఒకే ఒక్క ప్రశ్న.. హీరోతో పాటుగా హీరోయిన్లు కూడా సమన స్థాయిలో వర్క్ చేస్తున్నప్పుడు ఈక్వల్ గా రెమ్యునరేషన్ ఎందుకు ఇవ్వరు? అని హాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు అందరు హీరోయిన్స్ ఈ విషయంపై కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ మధ్య టాలీవుడ్ కోలీవుడ్ భామలు కూడా వారి హోదా చాలా పెరిగిందని ఇప్పటికైనా ఆ వ్యత్యాసంలో మార్పులు రావాలని గట్టిగానే చెప్పారు.

ముఖ్యంగా కోలీవుడ్ లో కూడా కొంతమంది భామలు పురుషాధిక్యం చాలా ఎక్కువైపోయిందని చెబుతున్నారు. మొన్న అమలాపాల్ - జ్యోతిక వంటి తారలు ఇదే విషయాన్ని ప్రస్తావించి హాట్ టాపిక్ అయ్యేలా చేశారు. అయితే ఇప్పుడు తెలుగులో కూడా కొంతమంది తారలు ఆ విధంగా స్పందిందిస్తున్నారు. అయితే రకుల్ మాత్రం కొంచెం విభిన్నంగా మాట్లాడుతోంది. రెమ్యునరేషన్ అనే ఒక్క విషయంలోనే కాదు.

ప్రతి విషయంలో పురుషాధిక్యత కనిపిస్తోంది. అందుకు కారణం కూడా లేకపోలేదు. మన సినిమాలు ఎక్కువగా కథానాయకుల చుట్టే తిరుగుతాయి. ఒకవేళ కథానాయికలు ఆ బాధ్యతలు తీసుకున్నప్పుడు అందుకు తగ్గట్టుగా రెమ్యునరేషన్ అడగడంలో తప్పులేదు. మన పాత్రలకు సమానంగా రెమ్యునరేషన్ ని తీసుకోవాలి. అది ఇప్పట్లో సడన్ గా వచ్చే మార్పు కాదు.

,  ,  ,  ,