Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

10-Mar-2017 11:15:20
facebook Twitter Googleplus
Photo

తాజాగా సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ మూవీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ నెల 20వ తేదీన షూటింగ్ ప్రారంభం కానుండగా.. 22 నుంచి హీరోయిన్ సమంత కూడా యూనిట్ తో జత కానుంది. అయితే.. చెర్రీ తర్వాతి ప్రాజెక్టు కూడా ఇప్పటికే కన్ఫాం అయిపోయిందనే ఓ టాక్ ఉంది.

దిగ్గజ దర్శకుడు మణిరత్నంతో.. మెగా పవర్ స్టార్ నెక్ట్స్ మూవీ ఉండనుందని అంటున్నారు. కార్తి-అదితి రావు హైదరిలతో తీస్తున్న చెలియా చిత్రాన్ని ఏప్రిల్ 7న రిలీజ్ చేయనున్న మణి రత్నం.. తన తర్వాతి చిత్రాన్ని చెర్రీతో చేయనున్నారు. జూన్ నుంచి ఈ మూవీ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉండగా.. ఈ చిత్రంలో రామ్ చరణ్ సోలో హీరో కాదని.. మరో ఇద్దరు తమిళ స్టార్లు నటించబోతున్నారని తెలుస్తోంది. విజయ్.. విక్రమ్ లు కూడా ఈ సినిమాలో హీరోలుగా నటించనున్నారట. భారీ క్యాస్టింగ్ తో తెరకెక్కనున్న ఈ మూవీ.. సౌతిండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ లలో ఒకటిగా నిలవనుందని తెలుస్తోంది.

విజయ్.. విక్రమ్.. రామ్ చరణ్ కాంబినేషన్ లో రూపొందే మూవీ.. అప్పట్లో వచ్చిన దళపతి మాదిరిగా స్ట్రాంగ్ స్టోరీతో.. ఎవరి పాత్ర కూడా తక్కువ ఎక్కువ అనే స్థాయిలు లేకుండా.. అందరికీ పవర్ ఫుల్ కేరక్టర్లతో నిండి ఉంటుందని అంటున్నారు. ఇప్పటికే విజయ్.. విక్రమ్.. చెర్రీలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారనే టాక్.

,  ,  ,  ,  ,